News May 12, 2024
IPL: చెన్నై టార్గెట్ 142 రన్స్
చెన్నైతో మ్యాచులో రాజస్థాన్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 141/5 పరుగులే చేసింది. ఇన్నింగ్స్ మొదటి నుంచీ RR బ్యాటర్లు రన్స్ చేసేందుకు కష్టపడ్డారు. జైస్వాల్ 24, బట్లర్ 21, శాంసన్ 15 రన్స్ మాత్రమే చేశారు. చివర్లో రియాన్ 47, జురెల్ 28 రన్స్ చేయడంతో RR ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. CSK బౌలర్లలో సిమర్‌జిత్ 3, తుషార్ 2 వికెట్లు తీశారు.
Similar News
News January 10, 2025
విడాకుల ప్రచారంపై స్పందించిన చాహల్
భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లుగా వస్తున్న వదంతులపై భారత క్రికెటర్ చాహల్ స్పందించారు. ఈమేరకు అభిమానులకు ఇన్‌స్టాలో ఓ లేఖ రాశారు. ‘నాకు ఇస్తున్న మద్దతుకు నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మీ మద్దతుతోనే ఇంతటివాడ్ని అయ్యాను. ఇంకా చాలా ప్రయాణం మిగిలే ఉంది. నా వ్యక్తిగత జీవితంపై ఆసక్తిని అర్థం చేసుకోగలను. కానీ దయచేసి ఆ విషయంలో సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయొద్దు’ అని కోరారు.
News January 9, 2025
అందుకే బీర్ల తయారీని నిలిపేస్తున్నాం: UBL
TG: రాష్ట్రంలో బీర్ల తయారీని నిలిపేయడానికి గల కారణాలపై యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ మరోసారి వివరణ ఇచ్చింది. ‘బీరు తయారీ ముడిసరకు ధరలు పెరిగాయి. బీరు ధరలో తయారీ రేటు 16 శాతం కాగా ప్రభుత్వ పన్నులు 70 శాతం ఉంటాయి. మాకు సర్కారు నుంచి సకాలంలో <<15107893>>చెల్లింపులు<<>> జరగట్లేదు. నష్టాలు భరించలేక బీర్ల సరఫరా ఆపేస్తున్నాం’ అని పేర్కొంది.
News January 9, 2025
వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల
AP: పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రేపటి నుంచి మొదలుకానున్న నేపథ్యంలో భూలోక వైకుంఠం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్కాంతుల ధగధగల మధ్య శ్రీవారి క్షేత్రం మెరిసిపోతోంది. స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తజన గోవింద నామ స్మరణతో ఏడుకొండలు మారుమోగుతున్నాయి. రేపు వైష్ణవ క్షేత్రాల్లో శ్రీమన్నారాయణుడి వైకుంఠ ద్వార దర్శనం ముక్తిని ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం.