News May 12, 2024

IPL: చెన్నై టార్గెట్ 142 రన్స్

image

చెన్నైతో మ్యాచులో రాజస్థాన్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 141/5 పరుగులే చేసింది. ఇన్నింగ్స్ మొదటి నుంచీ RR బ్యాటర్లు రన్స్ చేసేందుకు కష్టపడ్డారు. జైస్వాల్ 24, బట్లర్ 21, శాంసన్ 15 రన్స్ మాత్రమే చేశారు. చివర్లో రియాన్ 47, జురెల్ 28 రన్స్ చేయడంతో RR ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. CSK బౌలర్లలో సిమర్‌జిత్ 3, తుషార్ 2 వికెట్లు తీశారు.

Similar News

News February 16, 2025

చికెన్ మార్కెట్.. ఆదివారం ఆదుకునేనా?

image

చాలా ఇళ్లలో ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే బర్డ్ ఫ్లూ భయాందోళనలతో గత కొన్ని రోజులుగా చికెన్, గుడ్డు తినడాన్ని చాలామంది తగ్గించేశారు. ప్రమాదం లేదని ప్రభుత్వమే చెబుతున్నా ప్రజలు భయపడుతున్నారు. రేట్లు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. మరి ఆదివారమైనా ప్రజలు తిరిగి చికెన్ వైపు చూస్తారా లేక ఇతర నాన్ వెజ్ ఆప్షన్లను ఎంచుకుంటారా? చూడాలి.

News February 16, 2025

ఫ్యాన్స్‌కోసం మెగాస్టార్ కీలక నిర్ణయం?

image

గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సినిమాలేవీ విడుదల కాలేదు. ఈ ఏడాది విశ్వంభరను దించేందుకు సిద్ధమవుతున్న ఆయన, వచ్చే ఏడాది ముగిసేలోపు మరో రెండు సినిమాల్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తి కాగా.. తర్వాత అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో సినిమాల్ని వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివరిలోపు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి.

News February 16, 2025

రేపు భారత్‌కు ఖతర్ అమీర్

image

ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్-థనీ రేపు, ఎల్లుండి భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని ఆహ్వానం మేరకు అమీర్ భారత్‌కు వస్తున్నారని.. రాష్ట్రపతి, PM మోదీతో ఆయన భేటీ అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంపై ఈ పర్యటనలో చర్చలు జరుగుతాయని పేర్కొంది. 2015 మార్చిలో ఆయన తొలిసారి భారత్‌లో పర్యటించగా ఇది రెండో పర్యటన అని వెల్లడించింది.

error: Content is protected !!