News May 10, 2024
IPL: టాస్ గెలిచిన చెన్నై

గుజరాత్‌తో మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కెప్టెన్ రుతురాజ్ బౌలింగ్ ఎంచుకున్నారు.
చెన్నై: రుతురాజ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, దూబే, మొయిన్ అలీ, జడేజా, ధోనీ, సాంట్నర్, సిమర్‌జీత్ సింగ్, శార్దూల్, తుషార్ దేశ్‌పాండే
గుజరాత్: గిల్, సాయి సుదర్శన్, షారుక్, మిల్లర్, మాథ్యూ వేడ్, తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్
Similar News
News February 14, 2025
రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తాం: ట్రంప్

ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ (పరస్పర) సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. US నుంచి ఆయా దేశాలు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కువ టారిఫ్స్ వసూలు చేస్తోందని తెలిపారు. తాము కూడా భారత్ నుంచి అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు.
News February 14, 2025
స్టొయినిస్‌పై ఆరోన్ ఫించ్ మండిపాటు

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ ODIల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విధానంపై మాజీ క్రికెటర్ ఫించ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రిటైర్మెంట్ నిర్ణయం కచ్చితంగా అతడి ఇష్టం. ఎవరూ తప్పుబట్టరు. కానీ తనపై నమ్మకంతో సెలక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. మరి అతడు బాధ్యతగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ముందుగానే చెప్పాలి కదా? అది కచ్చితంగా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమైతే కాదు’ అని వ్యాఖ్యానించారు.
News February 14, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.