News April 13, 2025

IPL: డేంజర్ జోన్‌లో CSK, MI

image

IPL2025: PBKSపై సంచలన విజయంతో SRH పాయింట్ల పట్టికలో కాస్త ముందుకెళ్లింది. 6 మ్యాచ్‌లలో 2 విజయాలతో ఎనిమిదో స్థానానికి చేరింది. దీంతో తన ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఐదు సార్లు ట్రోఫీ విన్నర్లయిన MI, CSK 9, 10వ స్థానాల్లో నిలిచాయి. రేపు లక్నోతో జరిగే మ్యాచ్‌లో ఓడితే చెన్నై ఇంటిబాట పట్టడం దాదాపు ఖాయమే. ఇవాళ DCతో మ్యాచ్‌లో MI ఓడిపోతే ప్లేఆఫ్స్ అవకాశం సంక్లిష్టంగా మారుతుంది.

Similar News

News July 8, 2025

క్రికెట్ ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఆడరు?

image

క్రికెట్ పిచ్, ఔట్ ఫీల్డ్, భారీ సంఖ్యలో వచ్చే ప్రేక్షకులకు ఇండోర్ స్టేడియం సరిపోదు. పిచ్, బౌలింగ్‌లో స్వింగ్, సీమ్ వాతావరణ మార్పులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో ఇండోర్ క్రికెట్ ఆడుతున్నారు. అయితే వాటి రూల్స్ భిన్నంగా ఉంటాయి. ICC మాత్రం అధికారికంగా ఇలాంటి మ్యాచ్‌లు నిర్వహించట్లేదు. పైకప్పును బంతి తాకితే దాన్ని ఎలా పరిగణించాలనే విషయంలో గందరగోళం కూడా దీనికి కారణం.

News July 8, 2025

చలాన్లు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్?

image

TG: ట్రాఫిక్ చలాన్లు చెల్లించనివారిపై చర్యలకు రవాణాశాఖ సిద్ధమైంది. మూడు నెలల పాటు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్ చేయాలన్న పోలీసుల ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు కళ్లెం వేయడంతో పాటు భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత 7 నెలల్లో పదేపదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 18,973 మంది లైసెన్స్‌లను అధికారులు సస్పెండ్ చేశారు.

News July 8, 2025

చర్చకు రాకుంటే కేసీఆర్‌కు క్షమాపణ చెప్పు: KTR

image

TG: సీఎం రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని, తాము సరిపోతామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ‘రేవంత్.. నిజాయితీ, నిబద్ధత ఉంటే చర్చకు రా. లేకపోతే తప్పుడు కూతలు కూసినందుకు, మహా నాయకుడిపై అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి KCRకు క్షమాపణలు చెప్పు. చర్చ కోసం రేవంత్ ఎక్కడికి రమ్మన్నా వస్తా. చర్చకు సత్తా లేకపోతే సవాళ్లు చేయొద్దు. సీఎంకు వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఫైరయ్యారు.