News March 27, 2025
IPL: రికార్డు సృష్టించిన డికాక్

KKR తరపున ఛేజింగ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా క్వింటన్ డికాక్ రికార్డు సృష్టించారు. నిన్న RRతో జరిగిన మ్యాచులో అతడు 97 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు మనీష్ పాండే పేరిట ఉండేది. 2014 ఫైనల్‌లో PBKSపై పాండే 94 పరుగులు చేశారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో క్రిస్ లిన్ (93), మన్వీందర్ బిస్లా (92), గంభీర్ (90) ఉన్నారు.
Similar News
News April 20, 2025
నేటి ముఖ్యాంశాలు

* TG: ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం: రేవంత్
* అక్టోబర్‌లో BRS అధ్యక్షుడి ఎన్నిక: KTR
* ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు
* AP: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి వశం
* CBN ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: జగన్
* వైసీపీలో ఒకటి నుంచి వంద వరకు జగనే: వైవీ సుబ్బారెడ్డి
* IPL: ఢిల్లీపై గుజరాత్ విజయం
News April 20, 2025
ఎల్లుండి నుంచి అందుబాటులో హాల్ టికెట్లు

TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షను ఈ నెల 27న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి నిర్వహించే ఈ ఎగ్జామ్‌కి సంబంధించి హాల్ టికెట్లను ఎల్లుండి నుంచి <
News April 20, 2025
IPL: LSG సంచలన విజయం

జైపూర్లో జరుగుతున్న RRvsLSG మ్యాచ్‌లో లక్నో ఉత్కంఠ విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో RR 9 రన్స్ చేయాల్సి ఉండగా ఆవేశ్(మ్యాచ్‌లో 3 వికెట్లు) అద్భుత బౌలింగ్‌తో ఆ స్కోర్‌ను డిఫెండ్ చేశారు. దీంతో లక్నో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. జైస్వాల్(74), పరాగ్ (39) పోరాటం వృథా అయింది. LSG బౌలర్లలో శార్దూల్, మార్క్రమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.