News May 4, 2024
IPL: మిగతా మ్యాచులకు దీపక్ చాహర్ దూరం?
IPL-2024లో మిగతా మ్యాచులకు CSK బౌలర్ దీపక్ చాహర్ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు cricbuzz తెలిపింది. తొడ కండరాల గాయంతో అతను PBKSతో మ్యాచులో తొలి ఓవర్లోనే మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. మెడికల్ టీమ్ రిపోర్ట్ వచ్చాక అతణ్ని ఆడించాలా లేదా అనేది నిర్ణయిస్తామని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది. మరోవైపు LSG పేసర్ మయాంక్ యాదవ్ కూడా ఈ సీజన్‌లో మిగతా మ్యాచులకు దూరం కానున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
Similar News
News November 4, 2024
నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన
AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ఆయన అనంతరం గొల్లపల్లిలో మీడియాతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత జనసేన నేతలతో సమీక్ష చేస్తారు. రాత్రికి చేబ్రోలులోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్న పవన్ రేపు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తారు.
News November 4, 2024
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్
భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్ తనకు చివరిదని తెలిపారు. వచ్చే IPL వేలానికి కూడా ఆయన రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో ఈ 40ఏళ్ల వికెట్ కీపర్ IPLకూ గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడిన సాహా, రంజీల్లో బెంగాల్, త్రిపుర జట్లకు, IPLలో KKR, CSK, PBKS, SRH, GTకి ప్రాతినిధ్యం వహించారు.
News November 4, 2024
మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్-1
AP: చెరువుల్లో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచినట్లు కేంద్ర గణాంక శాఖ నివేదికలో వెల్లడైంది. జాతీయ స్థాయిలో ఏపీ వాటా 2011-12లో 17.7 శాతం ఉండగా, 2022-23 నాటికి 40.9 శాతానికి పెరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగాల్(14.4%), ఒడిశా(4.9%), బిహార్(4.5%), అస్సాం(4.1%) ఉన్నాయి. ఇక పశువుల ఉత్పత్తిలో ఏపీ ఫోర్త్, ఉద్యాన ఉత్పత్తుల్లో ఐదో స్థానంలో నిలిచింది.