News April 10, 2025
IPL: సన్‌రైజర్స్‌కు పండగ రోజులు కలిసి రావట్లేదా?

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ సీజన్లో పండగ రోజులు పెద్దగా కలిసిరావట్లేదు. ఇప్పటివరకు 4 మ్యాచుల్లో ఓడిపోగా అందులో రెండు పండుగ రోజుల్లోనే జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గత నెల 30న ఉగాది రోజు DCపై, ఈ నెల 6న శ్రీరామనవమి రోజున GTపై ఓడిపోయింది. మరోవైపు ఈ నెల 12న హనుమాన్ జయంతి రోజు PBKSతో తలపడనుంది. ఆంజనేయుడి ఆశీస్సులతో ఆరెంజ్ ఆర్మీ గెలిచి తీరుతుందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
Similar News
News April 18, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలో రానున్న 5రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయంది. మరోవైపు, మిగతా ప్రాంతాల్లో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది.
News April 18, 2025
రాష్ట్రంలో సహజ ప్రసవాలు అంతంతే..

AP: రాష్ట్రంలో సాధారణ ప్రసవాల కంటే శస్త్రచికిత్స ప్రసవాలు అధికమవుతున్నాయని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. సాధ్యమైనంత వరకూ సహజ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గైనకాలజిస్టులకు సూచించింది. తొలి కాన్పు సిజేరియన్ అయినప్పటికీ రెండో కాన్పు సహజ ప్రసవం చేసేలా చూడాలంది. కాగా సిజేరియన్లలో దేశంలోనే AP 2వ స్థానంలో ఉంది.
News April 18, 2025
ఆ కుక్క ధర రూ.50కోట్లు కాదు: ఈడీ

బెంగళూరుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి ఇటీవల రూ.50కోట్లకు ఓ కుక్కను కొన్నారన్న వార్త SMలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అది కాస్తా ED దృష్టికి వెళ్లడంతో అతని ఇంటిపై దాడి చేసింది. రూ.50 కోట్లు ఎలా వచ్చాయనే లావాదేవీలపై విచారణ జరిపి, వాస్తవాలను బయటపెట్టింది. కాకేసియన్ షెపర్డ్ జాతికి చెందిన ఆ శునకం ధర రూ. లక్ష కూడా ఉండదని తేల్చి చెప్పింది. కేవలం ప్రచారం కోసమే అతను గొప్పలు చెప్పుకుంటున్నట్లు వివరించింది.