News May 25, 2024

IPL: వర్షం కారణంగా ఫైనల్ రద్దయితే?

image

రేపు వర్షంతో SRH, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోతే రిజర్వ్ డే అయిన మే 27న జరగనుంది. ఆ రోజు కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయితే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. దీంతో టేబుల్ టాపర్‌గా నిలిచిన KKR టైటిల్ అందుకోనుంది. కాగా రేపు చెన్నైలో వర్షాలు కురిసే అవకాశం 3 శాతమేనని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News February 6, 2025

రేపు వైసీపీలోకి శైలజానాథ్

image

AP: మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరనున్నారు. ఇటీవల ఆయన జగన్‌తో భేటీ కాగా చేరికకు వైసీపీ చీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు ఉ.10 గంటలకు తాడేపల్లిలో శైలజానాథ్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. శైలజానాథ్ అనంతపురం జిల్లా శింగనమల నుంచి 2 సార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.

News February 6, 2025

అందరి ముందు బట్టలు విప్పేసిన భార్యను సమర్థించిన భర్త

image

గ్రామీ అవార్డుల వేడుకలో అమెరికా స్టార్ సింగర్ కాన్యే వెస్ట్ భార్య బియాంకా సెన్సారి <<15346210>>నగ్నంగా<<>> కెమెరాలకు పోజులిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తన భార్య చేసిన ఘనకార్యాన్ని కాన్యే సమర్థించారు. తన భార్య స్మార్ట్, టాలెంటెడ్, బ్రేవ్ అని వెనకేసుకొచ్చారు. తమపై విమర్శలొచ్చినప్పటికీ ఆరోజు అత్యధికంగా గూగుల్‌లో శోధించిన వ్యక్తిగా సెన్సారి నిలిచిందన్నారు. ఇది గ్రామీ అవార్డులను సైతం ఓడించిందని భార్యను కొనియాడారు.

News February 6, 2025

డిగ్రీ అర్హతతో రూ.1.10 లక్షల జీతంతో ఉద్యోగాలు

image

224 పోస్టుల భర్తీకి AAI (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 5లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. జనరల్ అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. SC, STలకు వయసు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) చదివి ఉండాలి. నెలకు రూ.31,000-రూ.1,10,000 జీతం ఉండనుంది. aai.aero

error: Content is protected !!