News October 21, 2024
‘ది హండ్రెడ్’ లీగ్‌లోకి IPL ఫ్రాంచైజీలు!
ఇంగ్లండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్‌లో పెట్టుబడి పెట్టేందుకు IPL ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటికే CSK, SRH, LSG, MI, KKR, DC తమ బిడ్స్ సబ్మిట్ చేసినట్లు సమాచారం. రాజస్థాన్ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తొలి రౌండ్ బిడ్డింగ్ మాత్రమే కావడంతో ఇప్పటికిప్పుడు ఆయా ఫ్రాంచైజీలు జట్లను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. IPL మెగావేలం తర్వాత జట్ల ఎంపిక ఉండొచ్చని తెలుస్తోంది.
Similar News
News November 12, 2024
DANGER: స్నానానికి స్క్రబ్స్ వాడుతున్నారా?
సబ్బు, బాడీ వాష్‌లకు అదనంగా చర్మం మృదువుగా మారడానికి, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి స్క్రబ్స్(సింథటిక్/ప్లాంట్ ఫైబర్)ను వాడటం పెరిగింది. అయితే వీటిని ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ తగలకపోవడం వల్ల స్క్రబ్స్‌పై బాక్టీరియా, సూక్ష్మక్రిములు, బూజు పేరుకుపోతాయంటున్నారు. దీంతో చర్మ వ్యాధులు, అలర్జీలు పెరుగుతాయని చెబుతున్నారు.
News November 12, 2024
ఢిల్లీకి రేవంత్.. క్యాబినెట్ విస్తరణ ఉంటుందా?
TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఇది చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే కొత్త మంత్రుల జాబితా ఢిల్లీ పెద్దల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో దీనిపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపైనా సీఎం చర్చిస్తారని సమాచారం.
News November 12, 2024
అమెరికా NSAగా ఇండియా ఫ్రెండ్.. చైనాకు విరోధి!
భారత్ అనుకూల వ్యక్తులకు డొనాల్డ్ ట్రంప్ పెద్దపీట వేస్తున్నారు. ఇండియా కాకస్ కోఛైర్మన్ మైక్ వాల్జ్‌ను NSAగా ఎంపిక చేశారని తెలిసింది. ఈ రిటైర్డ్ ఆర్మీ కల్నల్‌కు చైనా పొడ అస్సలు గిట్టదు. రిపబ్లికన్ చైనా టాస్క్‌ఫోర్స్‌లోనూ ఆయన సభ్యుడు. ఒకవేళ ఇండో పసిఫిక్ ప్రాంతంలో వివాదం ఏర్పడితే US మిలిటరీ సన్నద్ధంగా లేదని బాహాటంగానే చెప్పారు. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు ఎక్కువ, అమెరికా తక్కువ సాయం చేయాలని సూచించారు.