News April 11, 2024
IPL.. మిగతా జట్లకు గిల్ వార్నింగ్

తాము బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని ఇతర జట్లు గుర్తు పెట్టుకోవాలని గుజరాత్ కెప్టెన్ గిల్ హెచ్చరించారు. ‘లక్ష్యమెంతైనా చివరి వరకు పోరాడుతాం. ప్రత్యర్థులు GTని తేలిగ్గా తీసుకోవద్దు. నిన్నటి మ్యాచ్‌లో 3 ఓవర్లలో 45 రన్స్ చేయడం కష్టమేమీ కాదు. ఇద్దరు బ్యాటర్లు 9 బంతుల్లో 22 రన్స్ చేయాలి. ఓవర్‌లో 2 లేదా 3 బంతులను ఎటాక్ చేస్తే చాలు. రషీద్ ఖాన్, తెవాటియా అదే చేశారు’ అని కొనియాడారు.
Similar News
News March 28, 2026
HYD: సర్కారీ డేటాకు ‘సైబర్’ కన్నం..!

ప్రభుత్వ ఐటీ విభాగం భద్రతా వలయాన్ని ఛేదించి సైబర్ దొంగలు పడ్డారా? అంటే అవుననే అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఒక థర్డ్ పార్టీ వెండర్ అజాగ్రత్త వల్ల సుమారు 20 లక్షల మంది వ్యక్తిగత సమాచారం ‘డార్క్ వెబ్’లో ప్రత్యక్షమైనట్లు ‘బ్రీచ్ ఆడిట్’ నివేదిక వెల్లడించింది. సమాచారం గల్లంతైన వార్తలతో అధికారులు హుటాహుటిన సెక్యూరిటీ ప్యాచ్‌లను అప్‌డేట్ చేస్తూ నష్టనివారణ చర్యలు చేపట్టారు.
News March 28, 2026
Polyamory.. Tolyamory.. ఈ డేటింగ్ ట్రెండ్స్ తెలుసా?

డేటింగ్ ప్రపంచంలో కొత్త పదాలు వినిపిస్తుంటాయి. పార్ట్‌నర్ పర్మిషన్‌తో అందరికీ తెలిసేలా ఒకే టైమ్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో రిలేషన్ కొనసాగించడాన్ని ‘Polyamory’ అంటారు. ఇందులో ట్రాన్స్‌పరెన్సీ ముఖ్యం. మరోవైపు తన పార్ట్‌నర్‌కు బయట వేరే వ్యక్తితో సంబంధం ఉందని తెలిసినా చూసీచూడనట్లు వదిలేయడాన్ని ‘Tolyamory’ అంటారు. సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న ఈ మౌన అంగీకారానికి ఈ కొత్త పేరు వచ్చి చేరిందంతే.
News March 28, 2026
మూసీ పునరుద్ధరణ: ఆలయానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

TG: రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఈ నిర్మాణాన్ని మూసీ పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతోంది. ఆలయంలో వంద అడుగుల గాలి గోపురం, మూసీ నది మధ్యలో వంద అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీజలాలను కాపాడుకోవడం మన బాధ్యత అని సీఎం రేవంత్ చెప్పారు.


