News March 22, 2024
IPL: CSKకు గుడ్‌న్యూస్
IPLలో తొలి మ్యాచుకు ముందు CSKకు గుడ్‌న్యూస్. గాయం కారణంగా దూరమైన ఆ జట్టు యంగ్ పేసర్ మతీశా పతిరణ ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని అతడి మేనేజర్ ట్విటర్‌లో ప్రకటించారు. అయితే పతిరణకు లంక బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే అతడు CSK జట్టులో చేరనున్నారు. దీంతో ఒకటి, రెండు మ్యాచులకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. కాగా ఇవాళ తొలి మ్యాచులో RCBతో CSK తలపడనుంది.
Similar News
News September 20, 2024
సచివాలయంలో క్యాబినెట్ సమావేశం
TG: సచివాలయంలో CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న ప్రత్యేక అధికారాలను హైడ్రాకు కల్పించడం, కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, వరద నష్టం, పరిహారం చెల్లింపుపై చర్చించనున్నారు. తెలుగు వర్సిటీకి సురవరం, కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
News September 20, 2024
విరాట్ కోహ్లీ అరుదైన ఘనత
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించారు. సొంత గడ్డపై అత్యధిక పరుగులు పూర్తి చేసుకున్న ఐదో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన 12,000 పరుగుల మైలురాయి చేరుకుని ఈ ఫీట్ సాధించారు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ (14,192) ఉన్నారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ (13,117), జాక్వెస్ కలిస్ (12,305), కుమార సంగక్కర (12,043) నిలిచారు.
News September 20, 2024
నిఫ్టీ 50లో 44 స్టాక్స్ బులిష్
దేశీయ స్టాక్ మార్కెట్‌లోబుల్ జోర్ వల్ల నిఫ్టీ-50లోని 44 స్టాక్‌లు శుక్రవారం లాభాలు గడించడం గమనార్హం. అధిక వెయిటేజీ గల ICICI రూ.1,362కి ఎగబాకి 52 వారాల హైకి చేరింది. HDFC (1.68%) దన్నుగా నిలవడంతో దేశీయ సూచీలు గరిష్ఠాలకు చేరుకున్నాయి. M&M, ICICI, JSW Steel, L&T, కోల్ ఇండియా టాప్ గెయిన్స్‌గా నిలిచాయి. ఆటో(1.9%), బ్యాంక్(1.4%), ఫైనాన్షియల్ సర్వీసెస్(1.6%) వృద్ధి చెందాయి.