News March 16, 2024

ఐపీఎల్ ఇండియాలోనే

image

IPL రెండో ఫేజ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహిస్తారని వస్తున్న వార్తలను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఖండించారు. ‘మేము కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదిస్తున్నాం. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. త్వరలో ఐపీఎల్ రెండో ఫేజ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుంది. విదేశాలకు తరలించే అవకాశమే లేదు’ అని ఆయన చెప్పారు.

Similar News

News August 25, 2025

సీఎంపై కత్తితో అటాక్ చేసేందుకు ప్లాన్!

image

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఇటీవల రాజేశ్ సక్రియా(41) <<17460900>>దాడి<<>> చేసిన విషయం తెలిసిందే. వీధి కుక్కల తరలింపును వ్యతిరేకిస్తూ తాను ఇచ్చిన వినతులను పట్టించుకోనందుకే దాడి చేసినట్లు అతడు పోలీసులకు చెప్పాడు. అయితే తొలుత సీఎంను కత్తితో పొడవాలని రాజేశ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సీఎం ఆఫీస్ వద్ద టైట్ సెక్యూరిటీ ఉండటంలో కత్తిని విసిరేసి లోపలికి వెళ్లాడు. అక్కడ ఆమెను <<17460900>>చెంపపై<<>> కొట్టి, జుట్టు లాగాడు.

News August 25, 2025

స్వదేశీ వస్తువులే కొనండి: మోదీ

image

యువత స్వదేశీ వస్తువులనే కొనాలని PM మోదీ పిలుపునిచ్చారు. “ఒక్క విదేశీ వస్తువును కూడా ఇంటికి తీసుకురాకూడదని యువత నిర్ణయించుకోవాలి. స్వదేశీ వస్తువులే విక్రయిస్తామని వ్యాపారులు తమ దేశభక్తిని చాటుకోవాలి. ‘మేము స్వదేశీ వస్తువులే విక్రయిస్తాం’ అని దుకాణాల బయట బోర్డులు పెట్టాలి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌ మన బలం. స్వదేశీ ఉద్యమం మన భవిష్యత్తుకు భరోసానిస్తుంది” అని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో అన్నారు.

News August 25, 2025

నచ్చినచోట ఆయిల్ కొంటాం: భారత్

image

ఇండియన్ గూడ్స్‌పై US టారిఫ్స్ ఆంక్షల నేపథ్యంలో రష్యాలోని భారత అంబాసిడర్ వినయ్ కుమార్ ఫైరయ్యారు. ‘మార్కెట్లో బెస్ట్ డీల్ ఎక్కడుంటే అక్కడే భారత్ ఆయిల్ కొనుగోళ్లను కొనసాగిస్తుంది. US నిర్ణయం అసమంజసం. ఇది ఫెయిర్ ట్రేడ్ రూల్స్‌ను అణచివేయడమే. 140 కోట్ల భారతీయుల అవసరాలు తీర్చడానికే ప్రాధాన్యమిస్తాం. రష్యాతో పాటు పలు దేశాలతో భారత సహాయ సహకారాల వల్లే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్థిరపడింది’ అని స్పష్టం చేశారు.