News May 18, 2024

IPL: ధోనికి ఇదే చివరి సీజనా?.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు

image

IPLలో ధోనీకి ఇదే చివరి సీజన్ అనే అనుమానాలొచ్చేలా విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ధోనీతో ఇవాళ మ్యాచ్ ఆడుతున్నా. నాకు తెలిసి మేం కలిసి ఆడటం ఇదే చివరిదేమో? అతడు కొనసాగుతాడో? లేదో? ఎవరికి తెలుసు? ఈ మ్యాచ్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన అనుభూతి ఇస్తుంది. మేం దేశం తరఫున చాలా ఏళ్లు ఆడాం. టీమ్‌ను ఎన్నోసార్లు గెలిపించాం’ అని విరాట్ అన్నారు. అటు ఇవాళ్టి మ్యాచ్‌లో RCBపై గెలిస్తే CSK ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది.

Similar News

News December 26, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో రేపు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

News December 26, 2024

పాక్‌పై యుద్ధానికి 15వేలమంది తాలిబన్లు

image

తూర్పు అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని అక్కడి తాలిబన్ సర్కారు తేల్చిచెప్పింది. కాబూల్ నుంచి పాక్ సరిహద్దుల్లోకి 15వేలమంది తాలిబన్ ఫైటర్లను తరలిస్తున్నట్లు ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాక్‌లో వారి అనుబంధ సంస్థ టీటీపీ ఉగ్రదాడులు పెంచింది. ఈ నేపథ్యంలోనే పాక్, అఫ్గాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి.

News December 26, 2024

రూ.1,700 కోట్లు దాటిన ‘పుష్ప 2’ కలెక్షన్లు

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1,705 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 21 రోజుల్లోనే రూ.1705 కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. హిందీలోనే ఈ చిత్రం 700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఒక్క ముంబైలోనే రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు చేసింది.