News May 18, 2024
IPL: ధోనికి ఇదే చివరి సీజనా?.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు
IPLలో ధోనీకి ఇదే చివరి సీజన్ అనే అనుమానాలొచ్చేలా విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ధోనీతో ఇవాళ మ్యాచ్ ఆడుతున్నా. నాకు తెలిసి మేం కలిసి ఆడటం ఇదే చివరిదేమో? అతడు కొనసాగుతాడో? లేదో? ఎవరికి తెలుసు? ఈ మ్యాచ్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన అనుభూతి ఇస్తుంది. మేం దేశం తరఫున చాలా ఏళ్లు ఆడాం. టీమ్‌ను ఎన్నోసార్లు గెలిపించాం’ అని విరాట్ అన్నారు. అటు ఇవాళ్టి మ్యాచ్‌లో RCBపై గెలిస్తే CSK ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది.
Similar News
News December 2, 2024
మనుషుల్లానే ఆవులూ ఈ విషయంలో ఒత్తిడికి లోనవుతాయి!
మన సన్నిహితులు మనకు దూరమైతే వెలితిగా ఉన్నట్లే ఆవులకూ ఇలాంటి అనుభూతి కలుగుతుందని నార్తాంప్టన్ విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడైంది. ఆవులు నిర్దిష్ట సహచరులతో సన్నిహిత బంధాలను ఏర్పరుచుకుంటాయని, వాటి నుంచి విడిపోయినప్పుడు ఒత్తిడికి లోనవుతాయని తేలింది. ఆవులను ప్రశాంతమైన & ఉదాసీనమైన జీవులుగా భావించవచ్చని పరిశోధన పేర్కొంది. ఈ విషయాన్ని మీ ఇంట్లోని ఆవుల్లో మీరెప్పుడైనా గమనించారా?
News December 2, 2024
రూ.67వేల కోట్ల అప్పు ఏం చేశారు?: బొత్స
AP: కూటమి ప్రభుత్వం గత 6 నెలల్లో ₹67వేల కోట్ల అప్పు చేసిందని, రేపు మరో రూ.4వేల కోట్ల అప్పు తీసుకోబోతోందని YCP MLC బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ అప్పు అంతా దేనికోసం ఖర్చు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ తప్ప మిగతా ఏ హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. YCP ప్రభుత్వముంటే ఈ 6నెలల్లో ₹18,000కోట్లు పేదల ఖాతాల్లో వేసే వాళ్లమని చెప్పారు.
News December 2, 2024
భారీ జీతంతో 334 ఉద్యోగాలు
NLC ఇండియా లిమిటెడ్‌లో 334 పోస్టులకు ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జనరల్ మేనేజర్, అడిషనల్ చీఫ్ ఇంజినీర్ పోస్టులున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు అర్హులు. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.50,000-2,80,000 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
సైట్: https://www.nlcindia.in/