News May 26, 2024
IPL: నిరాశలో కావ్యా మారన్

కీలకమైన ఐపీఎల్ ఫైనల్లో SRH బ్యాటర్లు చేతులెత్తేశారు. లీగ్ మ్యాచుల్లో అదరగొట్టిన ఓపెనింగ్ జోడీ అభిషేక్-హెడ్ విఫలమైంది. వచ్చిన వాళ్లు వచ్చినట్లుగా పెవిలియన్‌కు క్యూ కడుతుంటే SRH యజమాని కావ్యా మారన్ నిరాశలో మునిగిపోయారు. KKR ఫాస్ట్ బౌలింగ్ ధాటికి వికెట్లు నేలకూలుతుంటే స్టేడియంలోని ఆరెంజ్ ఆర్మీ మొహాల్లోనూ నైరాశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Similar News
News February 8, 2025
చంద్రబాబు ప్రచారం చేసిన చోట్ల BJPకి ఆధిక్యం

AP సీఎం చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ బీజేపీ అభ్యర్థులు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రచారం కలిసొస్తుందని బీజేపీ అధిష్ఠానం భావించి ఆహ్వానించింది. ఆ పార్టీ ఆశించినట్లే చంద్రబాబు ప్రచారం వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.
News February 8, 2025
ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారు రేవంత్ రెడ్డీ?: హరీశ్ రావు

రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ‘ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి’ అని హితవు పలికారు.
News February 8, 2025
ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు?

ప్రస్తుతం వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలను చూస్తుంటే బీజేపీ 27ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ మాట్లాడుతూ.. సీఎం పోస్టుపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. అది తమకు పెద్ద సమస్య కాదన్నారు. ప్రస్తుతం బీజేపీ 42+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.