News August 26, 2024

IPL: LSG ఓనర్‌ను కలిసిన KL రాహుల్

image

KL రాహుల్ ఇవాళ LSG ఓనర్ సంజీవ్ గోయెంకాతో భేటీ అయ్యారు. రాహుల్ రిటెన్షన్‌తో పాటు జట్టు కూర్పుపై ఈ మీటింగ్‌లో చర్చించినట్లు సమాచారం. KLను అంటిపెట్టుకునేందుకు LSG ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ రాహుల్ మైండ్‌లో ఏముందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు అతను RCBకి వెళ్తారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 3 సీజన్లకు లక్నో కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ఆ జట్టులోనే కొనసాగుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

Similar News

News September 18, 2024

పంటల వారీగా నష్టపరిహారం ఇలా..

image

AP: నీట మునిగిన పంటలకు CM చంద్రబాబు పరిహారం ప్రకటించారు. హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకు ₹75వేలు, అరటి, పసుపు, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, సపోటా తదితర తోటలకు ₹35వేలు, పత్తి, వేరుశనగ, వరి, చెరకు, టమాటా, పువ్వులు, ఉల్లి, పుచ్చకాయ పంటలకు ₹25వేలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, కొర్రలు, సామలకు ₹15వేలు, ఆయిల్‌పామ్, కొబ్బరిచెట్లకు ఒక్కోదానికి ₹1,500.

News September 18, 2024

వారికి రూ.3వేల నిరుద్యోగ భృతి!

image

AP: రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి రూ.3,000 నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయశాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల 17న మెమో పంపినట్లు సమాచారం. అయితే ఆ మెమోలో ఈ నెల 16లోపు పంపాలని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

News September 18, 2024

ఆకట్టుకుంటున్న ‘దేవర’ కొత్త పోస్టర్లు

image

‘దేవర’ మూవీ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా మూవీ టీమ్ రిపీటెడ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూవీ టీమ్ కొత్త పోస్టర్లను రిలీజ్ చేసింది. మరోవైపు నిన్న చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ రేపు చండీగఢ్‌కు, ఈనెల 23న అమెరికా వెళ్తారని సమాచారం. ఈలోగా 22న HYDలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనుంది.