News March 30, 2024

IPL: నేడు లక్నో-పంజాబ్ ఢీ

image

ఐపీఎల్‌లో భాగంగా నేడు ఎల్ఎస్‌జీ, పంజాబ్ కింగ్స్ లక్నోలో తలపడనున్నాయి. గత ఏడాది ఈ రెండూ పంజాబ్‌లో మ్యాచ్ ఆడాయి. లక్నో 257 పరుగులు చేయగా.. పంజాబ్ 201 రన్స్ చేసి ఓడింది. లక్నో పిచ్ మందకొడిగా ఉండటంతో ఈరోజు మ్యాచ్‌లో ఆ స్థాయిలో పరుగులు రాకపోవచ్చంటున్నారు క్రీడా విశ్లేషకులు. ప్రస్తుతం పంజాబ్ 2 మ్యాచులాడి ఒక విజయాన్ని సాధించగా.. లక్నో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది.

Similar News

News February 12, 2026

హలో అనేందుకు మంత్రుల హడల్

image

తెలంగాణలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్న మంత్రి పొంగులేటి ఆరోపణ బాంబు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ టూల్స్‌తో BRS ట్యాప్ చేయిస్తుందేమోనని అనుమానిస్తున్న మంత్రులు నార్మల్ కాల్స్ ఆన్సర్ చేయడం లేదు. కొందరు మినిస్టర్స్ కొన్ని కాల్స్ అటెంప్ట్ చేసినా పైపై మాటలే. డీటెయిల్స్ జోలికి వెళ్లడం లేదు. ముఖ్య విషయాలు డిస్కస్ చేసేందుకు వాట్సాప్ కాల్ లేదా యాపిల్ ఫేస్ టైం వాడుతున్నారని సమాచారం.

News February 12, 2026

ALERT: ఈ లింక్స్ క్లిక్ చేయకండి!

image

వాలంటైన్స్ వీక్ పేరుతో వచ్చే మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘సర్‌ప్రైజ్ గిఫ్ట్’ వంటి లింక్‌లను క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుందని తెలిపారు. తెలియని నంబర్ల నుంచి లేదా గ్రూపుల్లో వచ్చే లింక్స్‌ను నమ్మి వ్యక్తిగత వివరాలు షేర్ చేయవద్దని సూచించారు. ఒకవేళ మోసపోతే ‘గోల్డెన్ అవర్’లో 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.

News February 12, 2026

నార్త్ కొరియా తదుపరి లీడర్‌గా కిమ్ జు ఏ?

image

ఉత్తర కొరియా తదుపరి లీడర్‌గా కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె ‘కిమ్ జు ఏ’ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సౌత్ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. ఆమెను తన వారసురాలిగా ప్రకటించేందుకు కిమ్ సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. ఇటీవల ఆమె కీలక సైనిక పర్యటనల్లో పాల్గొనడం, విధాన నిర్ణయాల్లో ఆమె అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి బలం చేకూరుస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.