News November 7, 2024

IPL: రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌లో మనోళ్లు వీరే

image

IPL మెగా వేలంలో ఈసారి భారత్ నుంచి 23 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో బరిలోకి దిగుతున్నారు. వీరిలో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అశ్విన్, చాహల్, వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్, పడిక్కల్, కృనాల్ పాండ్య, షమీ, సిరాజ్, అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, ముకేశ్, ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.

Similar News

News December 11, 2024

Stock Market: ఈ రోజు కూడా ఫ్లాట్‌గానే

image

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం కూడా ఫ్లాట్‌గా ముగిశాయి. సెంటిమెంట్‌ను బ‌లప‌రిచే న్యూస్ లేక‌పోవ‌డం, గ‌త సెష‌న్‌లో అమెరికా సూచీలు Dow Jones, Nasdaq, S&P500 న‌ష్ట‌పోవ‌డంతో దేశీయ సూచీలు స్త‌బ్దుగా క‌దిలాయి. Sensex 16 పాయింట్ల లాభంతో 81,526 వ‌ద్ద‌, Nifty 31 పాయింట్లు పెరిగి 24,641 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. FMCG, IT, ఆటో రంగ షేర్లు రాణించాయి. Trent, Baja Finance, Britannia టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.

News December 11, 2024

2035కల్లా అంతరిక్ష కేంద్రం పూర్తి: కేంద్ర మంత్రి

image

సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని 2035 కల్లా పూర్తి చేస్తామని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం తెలిపారు. 2040కల్లా భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపుతామన్నారు. ‘మన అంతరిక్ష కేంద్రాన్ని భారతీయ అంతరిక్ష స్టేషన్‌గా పిలుస్తాం. వచ్చే ఏడాది చివరినాటికి గగన్‌యాన్‌ ద్వారా వ్యోమగామిని రోదసిలోకి పంపిస్తాం. ఇక సముద్రం అడుగున 6వేల మీటర్ల లోతున కూడా పరిశోధనలు చేస్తాం’ అని తెలిపారు.

News December 11, 2024

మన ఆటగాళ్లు వెనక్కి తగ్గాల్సిన పనే లేదు: రవిశాస్త్రి

image

సిరాజ్, హెడ్ మధ్య జరిగిన గొడవపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘సిక్స్ కొట్టించుకున్న ఫాస్ట్ బౌలర్ వికెట్ తీశాక సిరాజ్‌లా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేం లేదు. అవతలి వాళ్లు ఒకటి అంటే మనం రెండు అనాలి. వెనక్కి తగ్గాల్సిన పనేలేదు. భారత కోచ్‌గా ఉన్నప్పుడూ ఆటగాళ్లకు అదే చెప్పాను. పరిస్థితిని మరింత దిగజారనివ్వని పరిపక్వత హెడ్, సిరాజ్‌కు ఉంది కాబట్టి సమస్య లేదు’ అని పేర్కొన్నారు.