News April 4, 2025
IPL: రోహిత్ శర్మకు గాయం.. మ్యాచ్‌కు దూరం

LSGతో మ్యాచ్‌లో MI టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నారు. మోకాలి గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. అతడి స్థానంలో రాజ్ అంగద్ బవ MI తరఫున అరంగేట్రం చేశారు.
LSG: మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్, మిల్లర్, బదోని, సమద్, దిగ్వేశ్, శార్దూల్, అవేశ్, ఆకాశ్‌దీప్
MI: జాక్స్, రికెల్టన్, సూర్య, నమన్ ధిర్, పాండ్య, రాజ్‌అంగద్, శాంట్నర్, దీపక్, బౌల్ట్, విఘ్నేశ్, అశ్వనీ కుమార్
Similar News
News April 11, 2025
చెన్నైపై ట్రోల్స్.. చెపాక్ స్టేడియం ఇలా అవుతుందట!

KKRపై చెన్నై ఘోరమైన బ్యాటింగ్‌తో నెటిజన్లు ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. అసలు ఇది టీ20నా? టెస్టా? అని ప్రశ్నిస్తున్నారు. బౌలింగ్ పిచ్ అయినంత మాత్రాన మరీ ఇంత దారుణంగా బ్యాటింగ్ చేస్తారా అని ఫైరవుతున్నారు. ఈ సీజన్ ముగిసేసరికి చెన్నై చెపాక్ స్టేడియం పూర్తిగా చెట్లతో నిండిపోతుందని ఓ ఎడిటెడ్ ఫొటో వైరల్ చేస్తున్నారు. కాగా IPLలో డాట్ బాల్‌కు ఒకటి చొప్పున మొక్కలు నాటనున్నారు.
News April 11, 2025
రామరాజ్యం తీసుకురావడమే నా కోరిక: CBN

AP: రాష్ట్రంలో రామరాజ్య స్థాపనే తన కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవంలో సతీసమేతంగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఒంటిమిట్టలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసి, టూరిజం హబ్‌గా మార్చుతామని చెప్పారు. తిరుమలలో లాగ ఇక్కడ కూడా నిత్య అన్నదానం నిర్వహించాలని టీటీడీ బోర్డును కోరారు.
News April 11, 2025
PHOTO: ధోనీ నాటౌట్?

సీఎస్కే కెప్టెన్ ధోనీ ఔట్ చర్చనీయాంశంగా మారింది. నరైన్ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చారు. ధోనీ రివ్యూ కోరగా రీప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. అయితే రీప్లేలో బంతి బ్యాటు పక్క నుంచి వెళ్తున్న క్రమంలో అల్ట్రాఎడ్జ్‌లో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నట్లు వీడియోలో కనిపించాయి. దీంతో క్లియర్ ఎడ్జ్ అయిందని, ఆయన నాటౌట్ అని పలువురు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమంటారు?