News April 4, 2025

IPL: రోహిత్ శర్మకు గాయం.. మ్యాచ్‌కు దూరం

image

LSGతో మ్యాచ్‌లో MI టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నారు. మోకాలి గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. అతడి స్థానంలో రాజ్ అంగద్ బవ MI తరఫున అరంగేట్రం చేశారు.
LSG: మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్, మిల్లర్, బదోని, సమద్, దిగ్వేశ్, శార్దూల్, అవేశ్, ఆకాశ్‌దీప్
MI: జాక్స్, రికెల్టన్, సూర్య, నమన్ ధిర్, పాండ్య, రాజ్‌అంగద్, శాంట్నర్, దీపక్, బౌల్ట్, విఘ్నేశ్, అశ్వనీ కుమార్

Similar News

News April 22, 2025

అట్లీ సినిమా కోసం బన్నీ కొత్త లుక్

image

అట్లీ- అల్లు అర్జున్ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ముంబైలో బన్నీపై లుక్ టెస్టుతోపాటు ఫొటోషూట్ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండు లుక్స్‌ను ఫైనల్ చేస్తారని టాక్. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ పలు గెటప్స్‌లో కనిపిస్తారని సమాచారం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది సెకండాఫ్‌లో మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి.

News April 22, 2025

మేలో సచివాలయాల సిబ్బంది బదిలీలు?

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు కసరత్తు జరుగుతోంది. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే జనరల్ కేటగిరీ సిబ్బంది కుదింపు పూర్తయ్యింది. మే మొదటి వారం నాటికి మిగిలిన 11 కేటగిరీల ఉద్యోగుల రేషనలైజేషన్ పూర్తవుతుందని సమాచారం. ఆ వెంటనే 2, 3 వారాల్లో బదిలీలను చేపడతారని తెలుస్తోంది. సచివాలయాల పరిధిలో జనాభా ఆధారంగా ఒక్కో ఆఫీసులో 6-8 మంది సిబ్బంది ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

News April 22, 2025

గ్రామీణ డాక్ సేవక్: సెకండ్ లిస్టు విడుదల

image

దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైన వారి రెండో జాబితా విడుదలైంది. <>https://indiapostgdsonline.gov.in/<<>>లో లిస్టు అందుబాటులో ఉంది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 1,215, టీజీలో 519 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సెకండ్ లిస్టులో AP నుంచి 702 మంది, TG నుంచి 169 మంది ఎంపికయ్యారు. అభ్యర్థులు మే 6లోగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవ్వాలి. కాగా గత నెలలో తొలి జాబితా విడుదలైంది.

error: Content is protected !!