News May 3, 2024

IPL: ముంబై టార్గెట్ 170 రన్స్

image

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 169 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ 70, మనీశ్ పాండే 42 రాణించారు. 57 రన్స్‌కే ఐదు వికెట్లు కోల్పోయిన తమ జట్టుకు వీరిద్దరూ కలిసి గౌరవప్రదమైన స్కోరును అందించారు. ముంబై బౌలర్లలో తుషార 3, బుమ్రా 3, హార్దిక్ 2 వికెట్లు తీయగా, చావ్లా ఒక వికెట్ పడగొట్టారు.

Similar News

News December 6, 2025

BECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 18 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఇంటర్, PG, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. వెబ్‌సైట్: https://www.becil.com

News December 6, 2025

కోళ్లలో కొక్కెర వ్యాధి లక్షణాలు

image

కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గిపోతుంది. శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లన్నీ బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో మరణిస్తాయి.

News December 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 88

image

ఈరోజు ప్రశ్న: విష్ణుమూర్తిని శ్రీనివాసుడు అని ఎందుకు పిలుస్తారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>