News April 11, 2024

IPL: నేడు ముంబై VS బెంగళూరు

image

ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడేలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచుల్లో తలపడగా ముంబై 18 మ్యాచుల్లో గెలిచింది. ఆర్సీబీ 14 మ్యాచుల్లో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఈ రెండు టీమ్‌లు ఒక్కో మ్యాచులో మాత్రమే గెలిచాయి. మరి నేడు గెలుపెవరిది? కామెంట్ చేయండి.

Similar News

News January 14, 2026

పసిపిల్లలను ఎండలో ఎందుకు ఉంచాలంటే?

image

చిన్నారులకు ఇలా ఎండ తగిగేలా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉదయం వచ్చే సూర్య రశ్మిపడితే శరీరానికి విటమిన్‌ డి లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది చిన్నారుల శరీరంలో కాల్షియం సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా నెలలు నిండకముందు జన్మించిన చిన్నారుల్లో సూర్య రశ్మి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల్లో వచ్చే కామెర్ల సమస్యను కూడా దూరం చేయవచ్చు.

News January 14, 2026

సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు?

image

సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక పురాణ, ఆరోగ్య, చారిత్రక కారణాలున్నాయి. రామాయణం ప్రకారం రాముడు తొలిసారిగా ఈ రోజునే గాలిపటం ఎగురవేశారని నమ్మకం. చలికాలంలో ఎండలో గాలిపటాలు ఎగురవేస్తే శరీరానికి కావాల్సిన విటమిన్-డి అందుతుంది. ఇదొక శారీరక వ్యాయామంగానూ ఉపయోగపడుతుంది. చైనాలో పుట్టిన ఈ గాలిపటాల సంప్రదాయం, కాలక్రమేణా సందేశాల రవాణా నుంచి ఉత్సాహభరితమైన వేడుకగా రూపాంతరం చెంది అందరినీ అలరిస్తోంది.

News January 14, 2026

FDDIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

హైదరాబాద్‌లోని ఫుట్‌వేర్ డిజైన్ & డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (<>FDDI<<>>)లో 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ/పీజీ(ఫుట్‌వేర్ టెక్నాలజీ), BTech/BE/ME/MTech, డిప్లొమా(టెక్స్‌టైల్ Engg/టెక్స్‌టైల్ డిజైన్), టెన్త్, 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 27వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://fddiindia.com/