News September 29, 2024
IPL: అక్టోబర్ 31 లాస్ట్ డేట్?
అక్టోబర్ 31 సాయంత్రం 5 గంటలలోగా అన్ని ఫ్రాంచైజీలు తమ ఫైనల్ రిటెన్షన్ల లిస్టును సమర్పించాలని బీసీసీఐ నిర్దేశించినట్లు తెలుస్తోంది. రిటెన్షన్‌లో గరిష్ఠంగా ఐదుగురు క్యాప్‌డ్, గరిష్ఠంగా ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు అనుమతించినట్లు సమాచారం. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు రూ.4 కోట్ల జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా బీసీసీఐ కాంట్రాక్టు పొందని వారిని అన్‌క్యాప్‌డ్‌గా భావిస్తారని సమాచారం.
Similar News
News October 5, 2024
వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరగలేదు: CM రేవంత్
TG: రూ.2లక్షలలోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు, ఆ పై మొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లు ఎక్కడానికి బదులుగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మితే ‘మన్నుపోసి అంబలి కాసిన’ పరిస్థితి వస్తుందని రేవంత్ అన్నారు.
News October 5, 2024
పేదలను ఎలా ఆదుకోవాలో సలహా ఇవ్వండి: CM
TG: మూసీ నిర్వాసితులను ఏ విధంగా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. పేదలకు అన్యాయం చేయబోమని, రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తామని స్పష్టం చేశారు. మూసీ విషయంలో రెచ్చగొట్టే వారి మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. పేదల మంచి కోసమే తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. పేదలకు న్యాయం చేసేందుకు BRS, BJPలు సూచనలు చేయాలని కోరారు.
News October 5, 2024
రేవంత్ CM కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు: KTR
TG: రేవంత్‌రెడ్డి CM కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అక్టోబర్ వచ్చినా మాఫీ చేయలేదన్నారు. రేవంత్ బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. సీఎం మనుషులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు.