News November 25, 2024
IPL: 18 ఏళ్ల ఆటగాడికి రూ.4.8 కోట్లు

ఐపీఎల్ వేలంలో అఫ్గాన్ యవ సంచలనం అల్లా ఘజన్ఫర్ భారీ ధర పలికారు. బేస్ ప్రైస్ రూ.75 లక్షలతో మొదలైన అతడిని ముంబై రూ.4.80 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. 2006లో జన్మించిన ఘజన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో IPL ఫ్రాంచైజీలను ఆకర్షించారు. ఇక వేలంలో పలువురు ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. వారిలో కేశవ్ మహరాజ్, ఆదిల్ రషీద్, అకేల్ హొసైన్, విజయ్‌కాంత్ వైస్కాంత్ ఉన్నారు.
Similar News
News November 24, 2025
దివ్యాంగురాలి దగ్గరకు వెళ్లి అర్జీ తీసుకున్న ప.గో కలెక్టర్

అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కాగా, ఓ దివ్యాంగురాలు అర్జీ ఇచ్చేందుకు రాగా.. కలెక్టర్ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
News November 24, 2025
BELOPలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<
News November 24, 2025
భారత్‌కు మరో ఓటమి తప్పదా?

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఓడిన టీమ్ఇండియా రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్సులో 201 పరుగులకే ఆలౌటై సఫారీలకు 288 రన్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అటు రేపు, ఎల్లుండి ఆట మిగిలి ఉండటంతో దూకుడుగా ఆడి <<18376327>>లీడ్<<>> పెంచుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది. రెండో ఇన్నింగ్సులోనూ భారత ప్లేయర్లు ఇదే ప్రదర్శన చేస్తే 0-2తో సిరీస్‌ను చేజార్చుకునే ప్రమాదముంది. దీంతో WTCలో స్థానం దిగజారనుంది.


