News November 25, 2024

IPL: 18 ఏళ్ల ఆటగాడికి రూ.4.8 కోట్లు

image

ఐపీఎల్ వేలంలో అఫ్గాన్ యవ సంచలనం అల్లా ఘజన్‌ఫర్ భారీ ధర పలికారు. బేస్ ప్రైస్ రూ.75 లక్షలతో మొదలైన అతడిని ముంబై రూ.4.80 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. 2006లో జన్మించిన ఘజన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో IPL ఫ్రాంచైజీలను ఆకర్షించారు. ఇక వేలంలో పలువురు ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. వారిలో కేశవ్ మహరాజ్, ఆదిల్ రషీద్, అకేల్ హొసైన్, విజయ్‌కాంత్ వైస్కాంత్ ఉన్నారు.

Similar News

News December 6, 2024

పెళ్లికి ముందే ఈ ప‌రీక్ష‌లు అవ‌స‌రం!

image

ప్రాణాంతక త‌ల‌సేమియా వ్యాధి నుంచి పిల్ల‌ల్ని ర‌క్షించ‌డానికి పెళ్లికి ముందే కాబోయే దంపతులు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. దేశంలో 4 కోట్ల మంది ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు! త‌ల్లిదండ్రులిద్ద‌రికీ ఈ సమస్యలుంటే పిల్ల‌ల‌కూ సంక్ర‌మించే అవ‌కాశం ఎక్కువ‌ని చెబుతున్నారు. మేనరిక వివాహాల వల్ల అత్యధికంగా సంక్రమించే ఈ వ్యాధి నుంచి పిల్లల రక్షణకు పెళ్లికి ముందే పరీక్షలు అవసరమని చెబుతున్నారు.

News December 6, 2024

పుష్ప-2.. తగ్గేదేలే

image

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా తొలి రోజు హిందీలో రూ.72కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో ఫస్ట్ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పోస్టర్ విడుదల చేసింది.

News December 6, 2024

పోలీస్ కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి

image

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని రెండు రోజుల కస్టడీకి ఇస్తూ కొడంగల్ కోర్టు తీర్పిచ్చింది. లగచర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అధికారులపై దాడి ఘటనలో నరేందర్ ప్రమేయం ఉందని, ఆయనను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది.