News April 12, 2025

IPL: సాయి సుదర్శన్.. కన్సిస్టెన్సీ కా బాప్..!

image

లక్నోపై GT ఓపెనర్ సాయి సుదర్శన్(56) మరోసారి అదరగొట్టారు. IPLలో అద్భుత ప్రదర్శనతో మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్‌గా అనిపించుకుంటున్నారు. ఈ సీజన్‌లో 6 ఇన్నింగ్స్‌లలో 329 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నారు. లాస్ట్ 10 IPL మ్యాచుల్లో కేవలం రెండుసార్లే సింగిల్ డిజిట్ స్కోర్ చేసి.. ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు చేశారు. త్వరలోనే సాయి టీమిండియాలో చోటు దక్కించుకుంటాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Similar News

News January 1, 2026

సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం?

image

AP: సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో శుభారంభ్ పేరుతో నిర్వహిస్తున్న న్యూఇయర్ వేడుకల్లో ఓ యువకుడు చనిపోయాడని సమాచారం. వేణుగోపాల్ నగర్‌కు చెందిన షౌకత్ కరెంట్ షాక్‌తో మృతి చెందాడని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేడుకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

News January 1, 2026

జనవరి 1: చరిత్రలో ఈరోజు

image

1892: స్వాతంత్ర్య సమరయోధుడు మహదేవ్ దేశాయ్ జననం
1894: గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జననం
1911: స్వాతంత్ర్య యోధురాలు ఎల్లాప్రగడ సీతాకుమారి జననం
1975: నటి సోనాలి బింద్రే జననం
1979: నటి విద్యాబాలన్ జననం
1955: శాస్త్రవేత్త శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ మరణం (ఫొటోలో)
1994: తెలుగు రచయిత చాగంటి సోమయాజులు మరణం (ఫొటోలో)
2007: తెలుగు సినీ నిర్మాత డూండీ మరణం

News January 1, 2026

ఈడీ సోదాల్లో నోట్ల కట్టలు.. సూట్‌కేస్ నిండా ఆభరణాలు!

image

ఢిల్లీలో జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలను ED గుర్తించింది. ఓ సూట్‌కేసులో ₹8.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయి. మరోవైపు ₹5 కోట్ల నగదుతోపాటు ₹35 కోట్ల ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ కేసులో ఇంద్రజిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. హరియాణాకు చెందిన ఇంద్రజిత్ సెటిల్‌మెంట్లు, బెదిరింపు వంటి కేసుల్లో నిందితుడు. UAEలో పరారీలో ఉన్నాడు.