News April 12, 2025

IPL: సాయి సుదర్శన్.. కన్సిస్టెన్సీ కా బాప్..!

image

లక్నోపై GT ఓపెనర్ సాయి సుదర్శన్(56) మరోసారి అదరగొట్టారు. IPLలో అద్భుత ప్రదర్శనతో మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్‌గా అనిపించుకుంటున్నారు. ఈ సీజన్‌లో 6 ఇన్నింగ్స్‌లలో 329 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నారు. లాస్ట్ 10 IPL మ్యాచుల్లో కేవలం రెండుసార్లే సింగిల్ డిజిట్ స్కోర్ చేసి.. ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు చేశారు. త్వరలోనే సాయి టీమిండియాలో చోటు దక్కించుకుంటాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Similar News

News April 19, 2025

ఓ దశకు ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు: ట్రంప్

image

కాల్పుల విరమణపై ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ఓ దశకు వచ్చాయని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దీర్ఘకాలిక వివాదాన్ని ముగించేందుకు తాను ఏ ఒక్కరికీ అనుకూలంగా లేనట్లు చెప్పారు. ఈ చర్చలను పుతిన్, జెలెన్‌స్కీలలో ఎవరు కష్టతరం చేసినా వారిని మూర్ఖులుగా పరిగణిస్తామన్నారు. ఆపై శాంతి ఒప్పందలో మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతామని తెలిపారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమైతే US ముందడుగు వేస్తుందని వెల్లడించారు.

News April 19, 2025

ఇది నమ్మశక్యంగా లేదు: రోహిత్ శర్మ

image

వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు తన పేరును పెట్టడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా ఫేవరెట్ రంజీ ప్లేయర్లను చూసేందుకు వాంఖడే బయట ఎదురుచూస్తూ ఉండేవాడిని. స్టేడియంలోకి అందర్నీ రానిచ్చేవారు కాదు. అలాంటిది అదే స్టేడియంలో నా పేరిట స్టాండ్ అంటే చాలా భావోద్వేగంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. ఇది ఎంతోమంది క్రికెటర్లకు కల’ అని హర్షం వ్యక్తం చేశారు.

News April 19, 2025

మైనర్ మినరల్ పాలసీ రిలీజ్ చేసిన ప్రభుత్వం

image

AP: రాష్ట్ర ప్రభుత్వం మైనర్ ఖనిజాల పాలసీ-2025 విడుదల చేసింది. అధిక ఆదాయ సృష్టి, పెట్టుబడుల ఆకర్షణే దీని ప్రధాన లక్ష్యమని వెల్లడించింది. 2022 మార్చి 13 వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకే లీజు మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా గ్రానైట్, మార్బుల్‌లాంటి ఖనిజాలున్న భూములను 30ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనుంది. మరోవైపు, యాన్యువల్ డెట్ రెంట్ మూడు నెలల్లోగా కట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

error: Content is protected !!