News September 6, 2024
IPL: కేకేఆర్ మెంటార్‌గా సంగక్కర?
కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మెంటార్‌గా శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర నియామకం కానున్నట్లు క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఆ జట్టు ద్రవిడ్‌ను కోచ్‌గా తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో KKR యాజమాన్యం సంగక్కరతో చర్చలు జరిపినట్లు సమాచారం. గత సీజన్‌లో KKR మెంటార్‌గా ఉన్న గంభీర్ ప్రస్తుతం IND హెడ్ కోచ్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News September 8, 2024
మరో 5 జిల్లాల్లో రేపు సెలవు
APలో మరో 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు రేపు సెలవు ప్రకటించారు. అతిభారీ వర్షాల దృష్ట్యా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా విద్యాసంస్థలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో సెలవు ఇచ్చారు.
News September 8, 2024
ఎమ్మెల్యేల అనర్హతపై రేపు హైకోర్టు తీర్పు
TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రేపు నిర్ణయం వెల్లడించనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా పలువురిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News September 8, 2024
ఓకే తాలూకాలో 12 మంది మృతి.. అంతుబట్టని జ్వరమే కారణం!
గుజరాత్ కచ్ జిల్లాలోని లఖ్‌పత్ తాలూకాలో ఇటీవల 12 మంది మృతి చెందడం కలకలం రేపింది. భారీ వర్షాల తరువాత బాధితులకు వచ్చిన తీవ్రమైన జ్వరాన్ని వైద్యులు కచ్చితంగా అంచనా వేయలేకపోయారని, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు పడ్డారని స్థానికులు చెబుతున్నారు. పాక్ సరిహద్దులో ఉండే ఈ తాలూకాలో సమస్య పరిష్కారానికి 22 వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. న్యుమోనైటిస్‌గా భావిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.