News May 19, 2024

IPL: శివమ్ దూబే అట్టర్ ఫ్లాప్?

image

టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన తర్వాత సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే దారుణ ప్రదర్శన చేస్తున్నారు. భారత జట్టుకు ఎంపికయ్యాక దూబే ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌లు ఆడి కేవలం 46 పరుగులే చేశారు. వరుసగా 0, 0, 21, 18, 7 స్కోర్లు సాధించారు. దీంతో అతడిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వరల్డ్ కప్ ముంగిట దారుణ ప్రదర్శన చేయడమేంటని ఫైర్ అవుతున్నారు. కీలక మిడిలార్డర్‌లో దూబే ఎలా ఆడతారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 8, 2024

ఇది మూర్ఖపు చర్య: KCR

image

తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడాన్ని మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘ఇదొక మూర్ఖపు చర్య. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాల్లో మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని ప్రజలకు వివరించాలి’ అని BRS నేతలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు, MLCలకు ఆయన సూచించారు.

News December 8, 2024

సీఎంను కలిసిన స్టార్ బాయ్ సిద్ధు

image

TG: DJ టిల్లు హీరో సిద్ధూ జొన్నలగడ్డ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. తండ్రి సాయికృష్ణతో కలిసి సీఎం రేవంత్‌కు రూ.15లక్షల చెక్కును అందించారు. తెలంగాణలో గతంలో సంభవించిన వరదలకు నష్టపోయిన ప్రాంతాలను ఆదుకునేందుకు CMRFకు విరాళంగా ఈ చెక్కును సిద్ధూ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో సిద్ధూను సీఎం అభినందించారు.

News December 8, 2024

యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక: మంత్రి

image

TG: గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అర్హులైన పేదలకు వీటిని ఇస్తామని, సంక్రాంతిలోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. లబ్ధిదారులను యాప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.