News January 12, 2025
మార్చి 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం

ఈ ఏడాది మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అలాగే మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ జరుగుతుందని చెప్పారు. బీసీసీఐ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్‌కు కొత్త కమిషనర్‌ను ఎన్నుకుంటామని వెల్లడించారు. కాగా తొలుత మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుందని శుక్లా ప్రకటించారు. అనంతరం 21నే ప్రారంభిస్తామని చెప్పారు.
Similar News
News February 19, 2025
Congratulations: దీప్తి జీవాంజికి గోల్డ్ మెడల్

23వ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో దీప్తి జీవాంజి మెరిశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగును 57.82 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో ఆమెకు పలువురు క్రీడాకారులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్‌లో కాంస్య పతక విజేత అయిన దీప్తి ఇటీవల అర్జున అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. దీప్తి జీవాంజిది TGలోని వరంగల్ జిల్లా పర్వతగిరి (M) కల్లెడ.
News February 19, 2025
21 ఏళ్లుగా ఊపిరితిత్తుల్లోనే పెన్ క్యాప్.. చివరకు!

TG: కరీంనగర్‌కు చెందిన 26ఏళ్ల యువకుడు 5ఏళ్ల వయసులో పెన్ క్యాప్ మింగేశాడు. అప్పుడు ఓ వైద్యుడు పరీక్షించి మలం ద్వారా క్యాప్ వెళ్లి ఉంటుందని, ఏ ఇబ్బంది లేదన్నారు. ఇటీవల 10రోజులుగా అతను అనారోగ్యంతో HYDలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. CT స్కాన్ చేసిన డాక్టర్లు ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్ ఉండటం గుర్తించి వెలికితీశారు. 21 ఏళ్లుగా క్యాప్ ఉండటం వల్ల ఊపిరితిత్తుల కండరాలు బాగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు.
News February 19, 2025
LRS.. మార్చి 31 వరకు గడువు

TG: లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. ఆలోగా క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25% రాయితీ ఇవ్వనుంది. LRSపై మంత్రులు నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 4 ఏళ్లలో ప్లాట్లు కొన్నవారికి, 10% ప్లాట్లు రిజిస్టర్ అయిన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లకూ అవకాశం కల్పించనున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.