News April 1, 2024
ఏప్రిల్ 16న IPL టీమ్ ఓనర్ల సమావేశం

ఐపీఎల్ సీజన్-18 మెగా వేలానికి బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి కసరత్తు ప్రారంభించాయి. అందుకు సన్నాహక సమావేశాన్ని ఏప్రిల్ 16న అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీల ఓనర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వేలం విధివిధానాలు, ప్లేయర్ల రిటెన్షన్స్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ప్రతి మూడేళ్లకు ఓసారి భారీ స్థాయిలో ఐపీఎల్ వేలం పాటను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News April 10, 2026
రోజూ పొద్దున్నే రాగి జావ తాగితే..

రాగుల్లో ప్రొటీన్స్, ఐరన్, ఫైబర్, అమైనో అమ్లాలు, విటమిన్ C, కాల్షియం అధికంగా ఉంటాయి. రోజూ పొద్దున్నే రాగి జావ తాగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చర్మానికి నిగారింపు వస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు రోజూ ఈ జావను తీసుకుంటే ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
#ShareIt
News April 10, 2026
ధనుష్-కృతి.. మరోసారి జోడీ!

ధనుష్, కృతి సనన్ జోడీగా గతేడాది రిలీజైన ‘తేరే ఇష్క్ మే’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ చేశారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. పీరియాడికల్ లవ్ స్టోరీని దర్శకుడు సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ ఏడాది చివర్లోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
News April 10, 2026
IPL నుంచి హసరంగ ఔట్!

LSG స్టార్ స్పిన్నర్ హసరంగ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యారు. ఆయన భారత్‌కు రాలేడనే అంచనాతో ఒకట్రెండు రోజుల్లో వేరే ప్లేయర్‌ను తీసుకోనున్నట్లు టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ప్రకటించారు. గతేడాది వేలంలో హసరంగను రూ.2 కోట్లకు LSG కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గాయంతో బాధపడుతున్న ఆయన శ్రీలంక బోర్డు నుంచి NOC పొందలేదు. హసరంగ స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ జార్జ్ లిండేను తీసుకునే అవకాశం ఉంది.


