News April 25, 2024
IPL: ఎక్కువ సెంచరీలు బాదిన జట్టు ఇదే

IPLలో ఆర్సీబీ జట్టు అత్యధికంగా 18 సెంచరీలు బాదింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 17 సెంచరీలు నమోదు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (14), సీఎస్కే (10), ఢిల్లీ (10), ముంబై (7), ఎస్ఆర్హెచ్ (6), గుజరాత్ (3), కోల్కతా (3), లక్నో (4), డెక్కన్ ఛార్జర్స్ (2), రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ (2) ఉన్నాయి.
Similar News
News October 31, 2025
CSల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వీధికుక్కల కేసులో అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్రాల CSలు సోమవారం ఫిజికల్గా హాజరు కావాలని ఆదేశించింది. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వర్చువల్ హాజరుకు అనుమతించాలని SG కోరగా తిరస్కరించింది. GOVT, MNPలు పరిష్కరించాల్సిన అంశాలపై కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడింది. TG, DL, WB మినహా ఇతరులు అఫిడవిట్లు ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.
News October 31, 2025
వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులతో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.
News October 31, 2025
యాచకురాలి దగ్గర నోట్ల కట్టలు!

కర్ణాటకలోని మంగళూరులో మానసిక అనారోగ్యంతో ఉన్న ఓ యాచకురాలు 13 ఏళ్లుగా చెత్త కుప్పల దగ్గర నివసిస్తోంది. ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించగా చెత్తలో ఉన్న సంచులను గట్టిగా పట్టుకుంది. అనుమానంతో వాటిని తెరిచి చూస్తే భారీగా నోట్లు, నాణేలు కనిపించాయి. వాటిని లెక్కిస్తే ₹లక్ష కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యాచకురాలిని అనాథ శరణాలయానికి తరలించారు.


