News April 25, 2024

IPL: ఎక్కువ సెంచరీలు బాదిన జట్టు ఇదే

image

IPLలో ఆర్సీబీ జట్టు అత్యధికంగా 18 సెంచరీలు బాదింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 17 సెంచరీలు నమోదు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (14), సీఎస్కే (10), ఢిల్లీ (10), ముంబై (7), ఎస్‌ఆర్‌హెచ్ (6), గుజరాత్ (3), కోల్‌కతా (3), లక్నో (4), డెక్కన్ ఛార్జర్స్ (2), రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ (2) ఉన్నాయి.

Similar News

News March 13, 2026

శుభ సమయం (13-3-2026) శుక్రవారం

image

➤ తిథి: బహుళ దశమి తె.5.51 వరకు
➤ నక్షత్రం: పూర్వాషాఢ రా.1.06 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.11-8.32, మ.1.18-సా.4.04, సా.5.04-సా.6.03
➤ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
➤ యమగండం: మ.3.00-సా.4.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.33-ఉ.9.12, మ.12.30-మ.1.18
➤ వర్జ్యం: ఉ.9.22-ఉ.11.07
➤ అమృత ఘడియలు: రా.7.51-రా.9.36

News March 13, 2026

పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇరాన్ ప్రెసిడెంట్‌తో మోదీ చర్చలు

image

పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్‌తో చర్చించినట్లు PM మోదీ ట్వీట్ చేశారు. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, మౌలిక సదుపాయాల ధ్వంసంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత పౌరుల భద్రత, అడ్డంకులు లేని ఇంధన సరఫరా తమకు అత్యంత ప్రాధాన్యత అంశాలని మోదీ స్పష్టం చేశారు. భారత్ ఎల్లప్పుడూ శాంతికి కట్టుబడి ఉంటుందని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పెజెష్కియాన్‌‌ను కోరారు.

News March 13, 2026

TODAY HEADLINES

image

*LPGపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారు: మోదీ
*దేశంలో గ్యాస్ లభ్యతపై ఆందోళన నెలకొంది: రాహుల్
*పారిశ్రామిక హబ్‌గా ఏపీ: చంద్రబాబు
*నర్సరీ నుంచి 12వ తరగతి విధానం తీసుకొస్తాం: రేవంత్
*TG: ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు
*16న విచారణకు హాజరు కావాలని కవితకు సీబీఐ నోటీసులు
*US నౌకపై ఇరాన్ దాడి.. ఇండియన్ మృతి
*గ్యాస్ కొరత నేపథ్యంలో రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా పెంపు