News April 25, 2024
IPL: నేడు GT, DC మధ్య కీలక పోరు
ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. 8 మ్యాచ్‌లలో 4 గెలుపులతో GT ఆరో స్థానంలో, 3 విజయాలతో DC ఎనిమిదో ప్లేస్‌లో ఉన్నాయి. నేడు గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని ఇరు జట్ల కెప్టెన్లు గిల్, పంత్ భావిస్తున్నారు. IPLలో ఇప్పటి వరకు ఈ టీమ్‌లు 4 సార్లు తలపడగా, చెరో రెండు సార్లు గెలిచాయి.
Similar News
News January 24, 2025
రూ.10 లక్షల వరకు నో IT?
నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. వార్షికాదాయం రూ.10లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, రూ.15లక్షల- రూ.20లక్షల ఆదాయం వరకు కొత్తగా 25% పన్ను శ్లాబ్‌ను తేవాలని భావిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రూ.15లక్షల పైబడిన ఆదాయానికి 30% పన్ను విధిస్తున్న విషయం తెలిసిందే.
News January 24, 2025
ChatGPT డౌన్.. కోట్లమందిపై ఎఫెక్ట్
OpenAI చాట్‌బాట్ ChatGPT కొన్ని గంటల పాటు డౌన్ అయింది. టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఔటేజెస్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్‌లో ఎర్రర్ రిపోర్టులు సబ్మిట్ చేశారు. దీనిని ధ్రువీకరించిన OpenAI సమస్యను పరిష్కరించింది. ChatGPT మొబైల్ యాప్ బాగానే ఉందని, వెబ్‌సైట్లోనే “bad gateway” సర్వర్ సమస్య తలెత్తినట్టు తెలిసింది.
News January 24, 2025
APలో HCLను విస్తరించాలని లోకేశ్ వినతి
APలో HCLను మరో 10వేల మందికి ఉపాధి కల్పించేలా విస్తరించాలని ఆ సంస్థ సీఈవో కళ్యాణ్‌కుమార్‌ను మంత్రి లోకేశ్ కోరారు. దావోస్ పర్యటనలో భాగంగా జరిగిన భేటీలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పాలసీల్లో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ప్రోత్సాహకాలు ప్రకటించామని, ఏపీలో రీలొకేషన్ చేసే పరిశ్రమలు, ఎక్విప్‌మెంట్ ఇంపోర్టుకు 50శాతం రాయితీలు ఇస్తామన్నారు.