News September 4, 2024
చరిత్రలో తొలిసారి పడిపోయిన IPL విలువ
చరిత్రలో తొలిసారి IPL ఎంటర్‌ప్రైజ్ విలువ పడిపోయిందని D&P అడ్వైజరీ రిపోర్టు పేర్కొంది. నిరుడు రూ.92,500 కోట్లుగా ఉన్న విలువ 10.6% తగ్గి రూ.82,700 కోట్లకు చేరిందని వెల్లడించింది. డిస్నీ, రిలయన్స్ విలీనం, ప్రసార హక్కులన్నీ వారివద్దే ఉండటం, మీడియా హక్కులకు పోటీ తగ్గడం కారణాలని చెప్పింది. ఇప్పటికీ MI అత్యంత విలువైన ఫ్రాంచైజీ అని, CSK తర్వాతి స్థానంలో ఉందంది. WPL విలువ 8% ఎగిసి ₹1,344 కోట్లకు చేరింది.
Similar News
News September 9, 2024
జో రూట్ ఖాతాలో మరో రికార్డు
ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా రూట్ (12,402) అవతరించారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు కుమార సంగక్కర (12,400) రికార్డును ఆయన అధిగమించారు. మరో 83 పరుగులు చేస్తే అలిస్టర్ కుక్ (12,472) రికార్డు కూడా రూట్ బద్దలుకొడతారు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ (15921) ఉన్నారు.
News September 9, 2024
నాటో పరిధిలో కుప్పకూలిన రష్యా డ్రోన్
రష్యాకు చెందిన ఓ సైనిక డ్రోన్ నాటో పరిధిలోని లాత్వియా దేశంలో తాజాగా కుప్పకూలింది. ఈ దేశాధ్యక్షుడు ఎడ్గర్స్ రింకెవిక్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. డ్రోన్ బెలారస్ మీదుగా తమ దేశంలో పడిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఈమధ్య పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో ఉన్న లాత్వియా, తర్వాతి కాలంలో ప్రత్యేక దేశంగా మారి నాటో సభ్యదేశమైంది.
News September 9, 2024
సెప్టెంబర్ 09: చరిత్రలో ఈరోజు
1914: కవి కాళోజీ నారాయణరావు జననం
1935: నటుడు, కూచిపూడి కళాకారుడు వేదాంతం సత్యనారాయణ శర్మ జననం
1953: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి జననం
1957: సినీ నటి జయచిత్ర జననం
1987: బాల మేధావి తథాగత్ అవతార్ తులసి జననం
తెలంగాణ భాషా దినోత్సవం