News May 20, 2024

IPL: ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లకు వర్షం పడితే?

image

ఈ ఐపీఎల్లో వర్షంతో మూడు లీగ్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. మరి ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లకు వర్షం వల్ల అంతరాయం ఏర్పడితే? దీనికి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సీజన్‌లో Q1, Q2, ఎలిమినేటర్ మ్యాచ్‌లకూ రిజర్వ్ డే ఉంది. అలాగే మ్యాచ్‌ను ముగించడానికి 120 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. లీగ్ మ్యాచ్‌లకు అయితే ఇది 60 నిమిషాలే. రిజర్వ్ డే రోజూ మ్యాచ్ జరగకపోతే ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు ముందుకెళ్తుంది.

Similar News

News February 4, 2026

ఐదేళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం

image

APని ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా మార్చాలని CM చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో 50 లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులతో ప్రకృతి సాగు చేయించడమే లక్ష్యమన్నారు. ఏలూరులో ‘కోకో సిటీ’, లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుకు శ్రీకారం చుట్టారు. విజయవాడలో ఫ్లవర్ మార్కెట్ ఏర్పాటుతో పాటు ఆన్‌లైన్ కూరగాయల డెలివరీ కోసం ‘డిజీ రైతు బజార్’, యంత్రాల బుకింగ్ కోసం ‘కిసాన్ డ్రోన్’ యాప్‌లను ప్రారంభించారు.

News February 3, 2026

క్యాబినెట్ భేటీ: ‘నెయ్యి కల్తీ’పై 2 గంటలు PPT

image

AP: క్యాబినెట్ మీటింగ్ అనేసరికి అధికారులు పలు అంశాలతో అజెండాను రెడీ చేస్తుంటారు. మంత్రివర్గమూ సుదీర్ఘంగా వాటిని చర్చిస్తుంది. అయితే ఇవాళ్టి భేటీలో మాత్రం శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం ఒక్కదానిపైనే చర్చించింది. నెయ్యి కల్తీపై దాదాపు 2 గంటలు PPT ప్రజెంటేషన్‌తో CM వివరించారు. సిట్ పేర్కొన్న అంశాలను లోతుగా విశ్లేషించారు. తెరవెనుక వ్యక్తులెవరో కూడా తేల్చాలని నిర్ణయించినట్లు సమాచారం.

News February 3, 2026

అదానీ గ్రూప్ షేర్ల జోరు.. ఒక్కరోజే ₹లక్ష కోట్ల లాభం!

image

US టారిఫ్స్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో అదానీ గ్రూప్ షేర్లు దూసుకెళ్లాయి. నేటి ట్రేడింగ్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ అత్యధికంగా 12.87% లాభపడగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ 11.89%, అదానీ ఎనర్జీ 10% వరకు పెరిగాయి. సుంకాల తగ్గింపు వల్ల ఆ గ్రూప్ ఆదాయాలు పెరుగుతాయనే అంచనాలు ర్యాలీకి కారణమయ్యాయి. ఒక్క రోజులోనే అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ దాదాపు ₹లక్ష కోట్లకు పైగా పెరిగి ₹13.78 లక్షల కోట్లకు చేరుకుంది.