News May 20, 2024

IPL: ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లకు వర్షం పడితే?

image

ఈ ఐపీఎల్లో వర్షంతో మూడు లీగ్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. మరి ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లకు వర్షం వల్ల అంతరాయం ఏర్పడితే? దీనికి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సీజన్‌లో Q1, Q2, ఎలిమినేటర్ మ్యాచ్‌లకూ రిజర్వ్ డే ఉంది. అలాగే మ్యాచ్‌ను ముగించడానికి 120 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. లీగ్ మ్యాచ్‌లకు అయితే ఇది 60 నిమిషాలే. రిజర్వ్ డే రోజూ మ్యాచ్ జరగకపోతే ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు ముందుకెళ్తుంది.

Similar News

News December 11, 2024

నేడు ఆ ల్యాండ్ మార్క్ దాటనున్న పుష్ప-2?

image

పుష్ప-2 విడుదలైన 5 రోజుల్లో(నిన్నటి వరకు) రూ.922 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం మూవీ నిన్న రూ.52.50 కోట్లు వసూలు చేసింది. ఆ ట్రెండ్ కొనసాగితే ఈరోజు ముగిసేసరికి ఆ మూవీ గ్రాస్ రూ.1000 కోట్లు దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే విడుదలైన వారంలోనే ఆ ఘనత సాధించిన తొలి భారత సినిమాగా పుష్ప-2 రికార్డు సృష్టిస్తుంది.

News December 11, 2024

మహ్మద్ షమీ ఆసీస్ టూర్ క్యాన్సిల్?

image

టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆయన 5 రోజుల మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్ సాధించలేదని, అందుకే ఈ టూర్‌ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. SMATలో భాగంగా బరోడాతో జరగబోయే క్వార్టర్ ఫైనల్లో ఆయన ఆడతారని తెలుస్తోంది. ఇందులో ఆయన ఫిట్‌నెస్‌ను మరోసారి పరీక్షిస్తారని సమాచారం. కాగా చివరి మూడు టెస్టుల కోసం షమీ ఆసీస్ వెళ్తారని ఇప్పటివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

News December 11, 2024

STOCK MARKETS: బ్యాంకు, ఫైనాన్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ఆరంభమయ్యాయి. నిఫ్టీ 24,625 (+12), సెన్సెక్స్ 81,536 (+27) వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు నిఫ్టీ 53,396 (-181) వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ ADV/DEC రేషియో 30:19గా ఉంది. బ్యాంకు, ఫైనాన్స్ రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఆటో, మీడియా, రియాల్టి, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు డిమాండ్ పెరిగింది. HCLTECH, ICICIBANK, DRREDDY, HDFC ANK, WIPRO టాప్ లూజర్స్. అల్ట్రాటెక్ 2.21% ఎగిసింది.