News March 24, 2025

IPL: ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

image

ఢిల్లీతో మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ 209 పరుగులు చేసింది. LSG ఓపెనర్ మిచెల్ మార్ష్(72), పూరన్(75) విధ్వంసంతో బౌలర్లకు చుక్కలు చూపించారు. చివర్లో DC బౌలర్లు వికెట్లు తీసి పరుగులు రాకుండా కట్టడి చేశారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 3, కుల్దీప్ 2, ముకేశ్, విప్రాజ్ తలో వికెట్ తీశారు. ఢిల్లీ టార్గెట్ 210.

Similar News

News March 29, 2025

‘మ్యాడ్ స్క్వేర్’ తొలిరోజు భారీ కలెక్షన్లు

image

నార్నె నితిన్, సంగీత్, రామ్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టినట్లు టీటౌన్ వర్గాలు తెలిపాయి. మొదటిరోజు ఏకంగా రూ.17 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. బ్రేక్ ఈవెన్ విలువ రూ.45 కోట్లు కాగా తొలిరోజే 40శాతం రికవరీ చేసినట్లు వెల్లడించాయి. లాంగ్ వీకెండ్ కావడంతో భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

News March 29, 2025

అమెరికా సుంకాలు భారత్‌కు మంచిదే: నీతి ఆయోగ్

image

చైనా, మెక్సికో, కెనడా దేశాలపై వచ్చే నెల 2 నుంచి US విధించనున్న అదనపు సుంకాలు భారత్ మంచికేనని నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రవాకర్ సాహూ అభిప్రాయపడ్డారు. ‘ప్రాథమికంగా చూస్తే ట్రంప్ ప్రతీకార సుంకాలు భారత్‌ను మరీ ఇబ్బంది పెట్టవు. ఏవో కొన్ని రంగాలు స్వల్పంగా ప్రభావితమవుతాయి. కానీ దీని వల్ల అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయి’ అని వివరించారు. US దిగుమతుల్లో 50శాతం చైనా, మెక్సికో, కెనడా నుంచే ఉన్నాయి.

News March 29, 2025

ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు

image

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.300 నుంచి రూ.307కి పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రూ.7 పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనం అమల్లోకి రానుంది.

error: Content is protected !!