News December 2, 2024
IPL: ఈ జట్లకు సారథులు ఎవరో?

IPLలో ప్రస్తుతం 5 జట్లకు కెప్టెన్లు ఉన్నారు. CSK-రుతురాజ్ గైక్వాడ్, MI-హార్దిక్ పాండ్య, SRH-పాట్ కమిన్స్, RR-సంజూ శాంసన్, GTకి శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ వహించనున్నారు. ఇక PBKS, DC, KKR, LSG, RCB జట్లకు ఇంకా సారథులను నియమించలేదు. పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి కేఎల్ రాహుల్, కోల్‌కతాకు వెంకటేశ్ అయ్యర్, లక్నోకు పంత్, బెంగళూరుకు కోహ్లీ నాయకత్వం వహిస్తారని టాక్. దీనిపై మీ కామెంట్.
Similar News
News March 12, 2026
రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పాలి: కోలీవుడ్

తమిళ దిగ్గజ నటుడు MGRపై ఇటీవల రాజేంద్రప్రసాద్ చేసిన వివాదాస్పద <<19346659>>వ్యాఖ్యలపై<<>> కోలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమిళ ఆరాధ్య దైవాన్ని కించపరచడం తగదని.. వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రముఖ యాక్టర్స్ నాజర్, విశాల్ డిమాండ్ చేశారు. కాంతారావు గొప్ప నటుడని, కానీ ఆయన్ని పొగిడే క్రమంలో మరో యాక్టర్‌ను తక్కువ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరారు.
News March 12, 2026
సాఫ్ట్‌వేర్ కంపెనీలను రీప్లేస్ చేసే ‘మాక్రోహార్డ్’!

సాఫ్ట్‌వేర్ కంపెనీలు చేయగలిగే అన్ని పనులను చక్కబెట్టే AI టూల్స్‌ను సిద్ధం చేయడం కోసం మస్క్ మాక్రోహార్డ్ ప్రాజెక్టును ప్రకటించారు. టెస్లా డిజిటల్ ఆప్టిమస్, గ్రోక్ LLM టెక్‌ను వాడి వీటిని తయారు చేయనున్నట్లు చెప్పారు. చౌకగా దొరికే టెస్లా AI4 చిప్స్‌ను వాడనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ కుదిపేస్తున్న తరుణంలో మస్క్ ప్రకటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
News March 12, 2026
OTD: భారతదేశ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఉగ్రదాడి!

భారత్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లకు నేటితో 33 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజున దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ ముఠా జరిపిన 12 పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోగా, 1,400 మంది క్షతగాత్రులయ్యారు. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, ఎయిర్ ఇండియా భవన్ వంటి కీలక ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన ఈ మారణహోమం నేటికీ దేశాన్ని కలచివేస్తోంది. దోషి యాకూబ్ మెమన్‌ను 2015లో ఉరితీశారు.


