News December 2, 2024

IPL: ఈ జట్లకు సారథులు ఎవరో?

image

IPLలో ప్రస్తుతం 5 జట్లకు కెప్టెన్లు ఉన్నారు. CSK-రుతురాజ్ గైక్వాడ్, MI-హార్దిక్ పాండ్య, SRH-పాట్ కమిన్స్, RR-సంజూ శాంసన్, GTకి శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ వహించనున్నారు. ఇక PBKS, DC, KKR, LSG, RCB జట్లకు ఇంకా సారథులను నియమించలేదు. పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి కేఎల్ రాహుల్, కోల్‌కతాకు వెంకటేశ్ అయ్యర్, లక్నోకు పంత్, బెంగళూరుకు కోహ్లీ నాయకత్వం వహిస్తారని టాక్. దీనిపై మీ కామెంట్.

Similar News

News February 16, 2025

రద్దీ నియంత్రణకు మెరుగైన వ్యవస్థ అవసరం: కేటీఆర్

image

TG: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన <<15476388>>తొక్కిసలాట ఘటనలో<<>> మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో రద్దీ నియంత్రణకు మెరుగైన వ్యవస్థ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

News February 16, 2025

నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత

image

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. వయోభారంతో HYD ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడిలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ‘సతీ అనసూయ’ సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. 1940లో మీర్జాపురం రాజా (మేకా రంగయ్య)తో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె నిర్మాతగానూ మారారు. ‘మనదేశం’ సినిమాతో NTRను చిత్రరంగానికి పరిచయం చేశారు.

News February 16, 2025

త్వరలో మహిళలకు నెలకు రూ.2,500: CM

image

TG: కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు నెలకు రూ.2500 ముఖ్యమైంది. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ఇక మార్చి 31లోపు వంద శాతం రైతు భరోసా డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు ఇస్తే, తాము రూ.12వేలు ఇస్తున్నామని చెప్పారు.

error: Content is protected !!