News May 1, 2024
IPL: ఇవాళ్టి మ్యాచులో ‘కింగ్స్’ ఎవరో?

IPL 2024లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఇవాళ రాత్రి 07:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచులు జరగగా సీఎస్కే 15 సార్లు, పంజాబ్ 13 సార్లు విజయం సాధించాయి. కాగా పాయింట్ల పట్టికలో చెన్నై 4, పంజాబ్ 8వ స్థానంలో ఉన్నాయి. మరి ఇవాళ్టి మ్యాచులో అసలైన కింగ్స్‌గా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి.
Similar News
News March 17, 2026
మన సైనికుల ప్రాణాల కంటే ట్రోఫీ ముఖ్యమా?.. SRHపై గవాస్కర్ ఫైర్

‘The Hundred’ కోసం అబ్రార్(PAK)ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనడాన్ని సునీల్ గవాస్కర్ తప్పుపట్టారు. ‘మనం చెల్లించే డబ్బు పరోక్షంగా IND సైనికుల మరణాలకు కారణమవుతుంది. అందుకే IPL టీమ్‌లు పాక్ ప్లేయర్లను తీసుకోవట్లేదు. కోచ్ వెటోరీకి ఈ విషయం అర్థం కాకపోవచ్చు. ఓనరైనా అడ్డుకోవాల్సింది. భారతీయుల ప్రాణాల కంటే ట్రోఫీ ముఖ్యమా? SRHను అభిమానులు బాయ్‌కాట్ చేయొచ్చు. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోవాలి’ అని సూచించారు.
News March 17, 2026
ఆరేళ్ల పదవీ కాలం.. ఒక్క ప్రశ్నా అడగలేదు!

మాజీ CJI జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభ MP పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఆరేళ్లలో ఆయన అటెండెన్స్ 53% ఉండగా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. 2023లో AUGలో ఢిల్లీ సర్వీసెస్ బిల్‌పై చర్చలో మాత్రమే పాల్గొన్నారు. కాగా 2020 మార్చి 16న ఆయనను RSకు కేంద్రం నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ‘నేను ముఖ్యమైన అంశాలు అని భావించినప్పుడు మాట్లాడతాను. నన్ను ఏ పార్టీ నియంత్రించలేదు’ అని 2021లో ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
News March 17, 2026
హైదరాబాద్‌లో UK స్కూల్స్!

TG: హైదరాబాద్‌లో యునైటెడ్ కింగ్‌డమ్(UK)కు చెందిన 13 ప్రఖ్యాత స్కూల్స్ తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. ఇందులో భాగంగా యూకే డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 18న రాష్ట్రంలో పర్యటించనుంది. ఎక్కడెక్కడ క్యాంపస్‌లు నెలకొల్పాలనే దానిపై రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరపనుంది.


