News April 5, 2025
IPL: ఉత్కంఠపోరులో గెలుపెవరిదంటే..

ముంబైతో జరిగిన ఉత్కంఠ పోరులో LSG విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో నమన్ ధీర్(24 బంతుల్లో 46), సూర్యకుమార్(43 బంతుల్లో 67) పోరాడినా ఫలితం లేకపోయింది. LSG బౌలర్లలో శార్దూల్, ఆకాశ్, ఆవేశ్, దిగ్వేశ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Similar News
News April 17, 2025
విదేశీ విద్యపై విద్యార్థులకు తగ్గుతున్న ఆసక్తి!

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఐదేళ్లలో తొలిసారి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలకు వెళ్లే స్టూడెంట్స్ వీసాల్లో మొత్తం 25% తగ్గుదల కనిపించింది. అమెరికాకు వెళ్లేవారిలో 34%, బ్రిటన్‌కు 26%, కెనడాకు 32% మంది విద్యార్థులు తగ్గుముఖం పట్టారు. ఆయా దేశాల్లో నిబంధనలు కఠినతరం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
News April 17, 2025
IPL: నేడు ముంబైతో హైదరాబాద్ ఢీ

ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య రా.7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 23 మ్యాచుల్లో తలపడగా MI 13, SRH 10 గెలిచాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో MI ఏడో స్థానంలో, SRH తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఇరు జట్లు తమ చివరి మ్యాచులో విజయాన్ని సాధించి తిరిగి ఫామ్ అందుకున్నాయి. దీంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశముంది.
News April 17, 2025
హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

TG: హైదరాబాద్‌లో 26 శాతం ఇళ్ల అమ్మకాలు పడిపోయినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 10,647 యూనిట్ల హౌస్ సేల్స్ జరిగినట్లు వెల్లడించింది. అదే గతేడాది ఇదే వ్యవధిలో 14,298 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. బెంగళూరులో 13 శాతం, చెన్నైలో 8 శాతం సేల్స్ పెరిగినట్లు వివరించింది.