News May 7, 2025
భారత్, పాక్ మధ్యవర్తిత్వానికి సిద్ధం: ఇరాన్

పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ‘తమ సోదర దేశాలు ఇండియా, పాక్‌తో సంబంధాలను మేము ఎప్పుడూ ఆస్వాదిస్తాము. ఇలాంటి క్లిష్ట సమయంలో ఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య మంచి సంబంధాలు ఏర్పరచేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉంది’ అని ఇరాన్ విదేశాంగశాఖ ట్వీట్ చేసింది. దీనిపై ఇటు భారత్ కానీ, అటు పాక్ కానీ ఇంకా స్పందించలేదు.
Similar News
News January 18, 2026
జగన్ ఉన్మాదానికి మరో BC నేత బలి: TDP

AP: మరో బీసీ నేతను జగన్ ఉన్మాదం బలి తీసుకుందని TDP మండిపడింది. కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన TDP నాయకుడి బర్త్‌డే వేడుకలకు వెళ్లి వస్తున్న బీసీ నేత లాలం బంగారయ్యను YCP నేతలు హత్య చేశారని ఆరోపించింది. బీసీ నేతలే టార్గెట్‌గా YCP చేస్తున్న దాడులు, హత్యలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పింది. అధికారం దక్కలేదనే పగతో ప్రజలను జగన్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించింది.
News January 18, 2026
మెస్రం వంశీయుల ఆచారాలు

నాగోబా జాతరను మెస్రం వంశీయులు నిర్వహిస్తారు. కఠిన నియమాలు పాటిస్తారు. కొత్తగా పెళ్లైన కోడళ్లను నాగోబా స్వామికి పరిచయం చేసే భేటింగ్ ఆచారం ప్రత్యేకమైనది. ఈ పూజ తర్వాతే వారు వంశంలో పూర్తిస్థాయి సభ్యులుగా గుర్తింపు పొందుతారు. అలాగే, జాతర కోసం గోదావరి నుంచి నీరు తెచ్చేటప్పుడు వీరు చెప్పులు వేసుకోకుండా కాలినడకన ప్రయాణిస్తారు. కులదైవం పట్ల వారికున్న అపారమైన భక్తికి, వంశ గౌరవానికి ఈ ఆచారాలు నిదర్శనం.