News October 4, 2024

ఇరాన్vsఇజ్రాయెల్: ఎవరి బలం ఎంతంటే..

image

ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య సైనిక బలాబలాల గురించి చూస్తే..
క్రియాశీల బలగాలు: ఇరాన్‌-6,10,000మంది, ఇజ్రాయెల్‌- 1,70,000మంది
రిజ్వర్వు బలగాలు: ఇరాన్-3,50,000, ఇజ్రాయెల్-4,65,000
రక్షణ బడ్జెట్: ఇరాన్-9.9 బిలియన్ డాలర్లు, ఇజ్రాయెల్-24.4 బిలియన్ డాలర్లు
ఫైటర్ జెట్లు: ఇరాన్-186, ఇజ్రాయెల్-241
హెలికాప్టర్లు, ట్యాంకులు: ఇరాన్-129, 2000, ఇజ్రాయెల్-146, 1300
సబ్‌మెరైన్లు: ఇరాన్-19, ఇజ్రాయెల్-5

Similar News

News November 6, 2024

యువరాజ్ గర్వపడేలా ఆడేందుకు యత్నిస్తా: అభిషేక్

image

తన మెంటార్ యువరాజ్ సింగ్ గర్వపడేలా దక్షిణాఫ్రికాతో జరిగే T20 సిరీస్‌లో ఆడతానని భారత బ్యాటర్ అభిషేక్ శర్మ పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి భారత్-సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. 2007లో యువీ 6 సిక్సులు కొట్టిన డర్బన్‌ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో యువీ ఇన్నింగ్స్‌ను బీసీసీఐ ఇంటర్వ్యూలో అభిషేక్ గుర్తుచేసుకున్నారు. తాను ఇంటి నుంచి ఆ మ్యాచ్ చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు.

News November 6, 2024

BREAKING: రాష్ట్రంలో నిలిచిన మద్యం సరఫరా

image

TG: సర్వర్ ప్రాబ్లమ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో మద్యం డిపోల నుంచి డీలర్లు లిక్కర్ తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది. కాగా రాత్రిలోపు సర్వర్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.

News November 6, 2024

రేపు అనుష్క మూవీ అప్డేట్స్

image

హీరోయిన్ అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కమర్షియల్ కాకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలకే ఆమె ఓటు వేస్తున్నారు. ఆమె ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటి’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనుష్క పుట్టినరోజు సందర్భంగా రేపు ఉ.9.45 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తామని పేర్కొంది.