News October 3, 2024

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి ఆమోదయోగ్యం కాదు: బైడెన్

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడం ఆమోదయోగ్యం కాదని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఈ దాడికి రెస్పాన్స్ ఇవ్వడంపై G7 లీడర్స్‌తో ఫోన్ కాల్ ద్వారా చర్చించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు తామెప్పుడూ కట్టుబడి ఉంటామని ట్వీట్ చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసేందుకు తాము మద్దతు ఇవ్వడం లేదని బైడెన్ స్పష్టం చేశారు.

Similar News

News November 9, 2024

కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ లీక్

image

మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీకైంది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంపై ఫ్యాన్స్, మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందించే సినిమా నుంచి లీక్స్ లేకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు. కన్నప్పలో ప్రభాస్ నంది పాత్రలో నటిస్తుండగా, ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి లుక్‌ను రిలీజ్ చేయలేదు. టీజర్‌లో కేవలం ఆయన కళ్లను మాత్రమే చూపించారు.

News November 9, 2024

ఆర్మీ ఆఫీసర్ వేధింపులతో మిలిటెంట్ కావాలనుకున్నా: MLA కైజర్

image

తాను యువకుడిగా ఉన్నప్పుడు ఆర్మీ ఆఫీసర్ వేధింపులతో మిలిటెంట్ కావాలనుకున్నానని NC MLA కైజర్ జంషైద్ వెల్లడించారు. J&K అసెంబ్లీలో మాట్లాడుతూ ‘అప్పుడు నాతో సహా 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులతో చేరిన వ్యక్తి గురించి తెలియదనడంతో కొట్టారు. దీంతో తాను మిలిటెంట్ అవ్వాలనుకుంటున్నానని సీనియర్ ఆఫీసర్‌తో చెప్పా. ఆయన తన సహోద్యోగిని మందలించడంతో వ్యవస్థపై నమ్మకం వచ్చింది’ అని పేర్కొన్నారు.

News November 9, 2024

ఎక్కడున్నవాళ్లు అక్కడే వివరాలు నమోదు చేయించుకోవచ్చు: ప్రభుత్వం

image

TG: రెండు రోజులుగా ఇళ్లకు స్టిక్కర్లు అంటించిన అధికారులు నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారు. వివిధ కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు ప్రస్తుతం ఎక్కడ ఉంటే అక్కడే వివారాలు నమోదు చేయించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్‌లో అడ్రస్‌తో సంబంధం లేదని పేర్కొంది. అయితే సిబ్బంది వచ్చినప్పుడు ఆధార్, రేషన్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంక్ పాసుపుస్తకం సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.