News September 5, 2024
భారత ఆహారంలో ఐరన్, అయోడిన్ లోపం: నిపుణులు
భారత ఆహారంలో సరిపడినంత ఐరన్, అయోడిన్, ఫొలేట్, కాల్షియం ఉండటం లేదని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. వీటి లోపం కారణంగా గర్భిణులు, ఐదేళ్ల లోపు చిన్నారులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు మానసిక, శారీరక ఎదుగుదలలో లోపాలతో పాటు పలు రకాలైన అనారోగ్యాల బారిన పడుతున్నారని వివరిస్తున్నారు. భారత్‌లో 50శాతానికి పైగా పిల్లలకు సరైన పోషకాలు అందడంలేదని వారు పేర్కొన్నారు.
Similar News
News September 12, 2024
చంద్రబాబుతో కేంద్ర బృందాల భేటీ
ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాలు సచివాలయంలో CM చంద్రబాబుతో భేటీ అయ్యాయి. వరద నష్టంపై తాము చేపడుతున్న ఎన్యూమరేషన్ గురించి CMకి వివరించాయి. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం కేంద్ర బృందాలను కోరారు. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందని చంద్రబాబు వివరించారు. కాగా రూ.6882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇప్పటికే కేంద్రానికి ప్రభుత్వం నివేదిక అందించింది.
News September 12, 2024
ఇందిరాగాంధీతో JNUకి రిజైన్ చేయించిన సీతారాం
సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేవారు. 1977లో JNU ఛాన్సలర్‌గా ఉన్న అప్పటి PM ఇందిరాగాంధీ ఆ పోస్టుకు రిజైన్ చేయాలన్న డిమాండ్‌ను ఆమె ఎదుటే నిల్చుని వినిపించారాయన. JNU విద్యార్థుల్ని సంఘటితం చేసి ప్రధాని నివాసానికి తీసుకెళ్లి ఆమెపై చేసిన తీర్మానాన్ని చదివారు. ఆ తర్వాత ఇందిర ఆ పదవికి రిజైన్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
News September 12, 2024
ఎర్రమట్టి దిబ్బలపై విచారణకు ఆదేశం
AP: విశాఖ జిల్లా భీమిలి మండలంలోని ఎర్రమట్టి దిబ్బలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. సర్వే నంబర్ 118/5Aలో 250 ఎకరాలకు పైగా భూములను ఓ హౌసింగ్ సొసైటీకి కేటాయించారు. అయితే ఆ భూములన్నీ వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి చర్యలకు ఆదేశించింది.