News April 4, 2025
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు: BRS నేత

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని BRS నేత రాకేశ్ రెడ్డి ఆరోపించారు. ‘గ్రూప్-1 అభ్యర్థుల్లో 40% మంది తెలుగు మీడియం వారు ఉన్నారు. వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకర్లలో లేరు. మొత్తం 46 సెంటర్లలో పరీక్షలు జరగగా, కేవలం 2 సెంటర్ల నుంచే 72 మంది టాపర్లున్నారు. 25 సెంటర్ల నుంచి ఒక్కరికీ టాప్ ర్యాంక్ రాలేదు. ఇదెలా సాధ్యం’ అని ప్రశ్నించారు. 18, 19వ సెంటర్లలో ఏదో గోల్ మాల్ జరిగిందన్నారు.
Similar News
News April 11, 2025
రాణాను కోర్టులో హాజరుపరిచిన NIA

26/11 ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో భారీ బందోబస్తు మధ్య హాజరుపరిచారు. అతడిపై UAPA కేసుల్ని నమోదు చేసిన అధికారులు, 14రోజుల కస్టడీకి రాణాను అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కేంద్రం నియమించింది.
News April 11, 2025
మూవీ ఇండస్ట్రీలోకి రొనాల్డో

పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ‘URMarv’ పేరిట ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియోను లాంచ్ చేశారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మాథ్యూ వాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇప్పటికే ఫ్యాషన్, పర్ఫ్యూమ్, లగ్జరీ వాచ్‌లకు సంబంధించిన వ్యాపారాల్లో భాగమైన రొనాల్డో ఇప్పుడు సినిమాల్లోనూ అడుగు పెట్టారు. కొన్ని నెలల క్రితం ఆయన యూట్యూబ్ ఛానల్‌నూ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
News April 11, 2025
రికార్డు: 64 ఏళ్ల వయసులో టీ20ల్లో అరంగేట్రం

పోర్చుగల్ మహిళా క్రికెట్ జట్టు తరఫున జొన్నా చైల్డ్ 64 ఏళ్ల వయసులో టీ20 అరంగేట్రం చేశారు. దీంతో అతిపెద్ద వయసులో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండో ప్లేయర్‌గా నిలిచారు. నార్వేతో జరిగిన మ్యాచులో ఆమె ఈ ఘనత అందుకున్నారు. ఈ లిస్టులో జిబ్రాల్టర్‌కు చెందిన సాలీ బార్టన్ (66 ఏళ్ల 334 రోజులు) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. నార్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను పోర్చుగల్ 2-1 తేడాతో గెలుచుకుంది.