News January 1, 2025

గౌతమ్ గంభీర్‌ను తప్పించే యోచనలో BCCI?

image

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐ వేటు వేసే అవకాశం ఉందని PTI తెలిపింది. చివరి టెస్టులో పర్ఫార్మెన్స్ మెరుగుపడకపోతే అతడి స్థానం గల్లంతయ్యే అవకాశం ఉందని BCCI అధికారి ఒకరు చెప్పినట్లు పేర్కొంది. కోచ్‌గా తమ మొదటి ప్రాధాన్యత VVS లక్ష్మణ్ అని, అతడు అంగీకరించకపోవడంతో గంభీర్‌ను ఎంపిక చేశామన్నారని తెలిపింది. రూల్స్ అతిక్రమిస్తున్నారని గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ పైనా BCCI అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Similar News

News January 15, 2025

చదువుతో పనిలేదు.. మీ వర్క్ పంపండి: ఎలాన్ మస్క్

image

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బంపరాఫర్ ఇచ్చారు. చదువుతో సంబంధం లేకుండా వారు తయారుచేసిన బెస్ట్ వర్క్‌ను పంపి తమతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘మీరు అసలు స్కూల్‌కు వెళ్లకపోయినా, చదవకపోయినా, పెద్ద కంపెనీలో పనిచేయకపోయినా మేం పట్టించుకోం. మీరు everything app(మస్క్ డ్రీమ్ యాప్) రూపొందించాలనుకుంటే మీ బెస్ట్ వర్క్‌ను code@x.comకి పంపండి’ అని ట్వీట్ చేశారు.

News January 15, 2025

చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందే: CM రేవంత్

image

TG: రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులపై కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీ నిర్మిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జల్‌శక్తి శాఖ, GRMB, KRMB, AP CMకు లేఖలు రాయాలని చెప్పారు.

News January 15, 2025

కేంద్ర మంత్రులతో శ్రీధర్‌బాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

image

TG: కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, గజేంద్ర సింగ్‌తో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణకు సహకరించాలని వైష్ణవ్‌ను కోరారు. ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, రామగిరి ఫోర్ట్‌ల అభివృద్ధికి సహకరించాలని గజేంద్ర సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.