News February 5, 2025
ఢిల్లీలో కాంగ్రెస్‌కు శూన్య హస్తమేనా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు BJPకి, మరికొన్ని ఆప్‌కు అధికారం దక్కుతుందని తెలిపాయి. కాగా, దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవదని చెప్పాయి. 0-3 సీట్లకే ఛాన్స్ ఉందని ఒకట్రెండు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని ఖతమైనట్లే అని, ఆప్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.
Similar News
News February 6, 2025
శుభ ముహూర్తం(06-02-2025)
✒ తిథి: శుక్ల నవమి రా.1.03 వరకు
✒ నక్షత్రం: కృతిక రా.9.48 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేదు
✒ రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి ఉ.10.48, మ.2.48 నుంచి 3.36 వరకు
✒ వర్జ్యం: ఉ.10.32 నుంచి మ.12.02 వరకు
✒ అమృత ఘడియలు: రా.7.33 నుంచి 9.03 వరకు
News February 6, 2025
నేటి ముఖ్యాంశాలు
* జగన్ 2.O చూడబోతున్నారు: YS జగన్
* జగన్ 1.O విధ్వంసం మరిచిపోలేదు: లోకేశ్
* పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్
* గొంగడి త్రిషకు TG ప్రభుత్వం రూ.కోటి నజరానా
* కులగణన సర్వేలో మళ్లీ వివరాలివ్వొచ్చు: పొన్నం
* రాహుల్.. ఎన్నికల గాంధీగా పేరు మార్చుకోండి: KTR
* ప్రశాంతంగా ఢిల్లీ పోలింగ్.. BJPకే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు
* అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలసదారులు
* భారీగా పెరిగిన బంగారం ధరలు
News February 6, 2025
‘RC16’ సెట్‌లో క్లీంకారా సందడి
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్‌లో చరణ్ కుమార్తె క్లీంకార సందడి చేశారు. చెర్రీ ఆమెను ఎత్తుకుని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.