News February 5, 2025
ఢిల్లీలో కాంగ్రెస్‌కు శూన్య హస్తమేనా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు BJPకి, మరికొన్ని ఆప్‌కు అధికారం దక్కుతుందని తెలిపాయి. కాగా, దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవదని చెప్పాయి. 0-3 సీట్లకే ఛాన్స్ ఉందని ఒకట్రెండు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని ఖతమైనట్లే అని, ఆప్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.
Similar News
News January 21, 2026
విద్యార్థులకు ALERT.. ఏకలవ్య పాఠశాలల్లో ADMISSIONS

TGలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 1380 సీట్లను భర్తీ చేయనున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 29న నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. అర్హులైన విద్యార్థులు https://tsemrs.telangana.gov.in ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. SHARE IT.
News January 21, 2026
ఎంపీ మల్లు రవి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

TG: ఎంపీ మల్లు రవి, అలంపూర్ MLA విజయుడు మధ్య <<18912878>>వాగ్వాదంపై<<>> KTR ఫైరయ్యారు. ఎమ్మెల్యేపై ఎంపీ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని Xలో పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతల దిగజారుడుతనానికి ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. దాడిని ఖండిస్తూ, మల్లు రవి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. CM రేవంత్ నైతిక బాధ్యత వహించి ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు.
News January 21, 2026
100 ఏళ్లుగా హిందుత్వంపై డీఎంకే దాడి: మద్రాస్ HC తీవ్ర వ్యాఖ్యలు

సనాతన ధర్మంపై తమిళనాడు Dy.CM ఉదయనిధి <<14423722>>స్టాలిన్ చేసిన కామెంట్స్<<>> విద్వేష ప్రసంగం కిందికే వస్తాయని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘100 ఏళ్లుగా హిందూ మతంపై DMK(గతంలో DK) దాడి చేస్తోంది. ఈ మంత్రి అదే సైద్ధాంతిక వంశానికి చెందిన వారు’ అని ఆగ్రహించింది. విద్వేష ప్రసంగాలు చేసే వారికి శిక్షలు పడటంలేదని చెప్పింది. మంత్రి చేసిన ద్వేషపూరిత ప్రసంగంపై రాష్ట్రంలో ఒక్క కేసూ నమోదు కాలేదని గుర్తుచేసింది.


